Thummala Nageswara Rao: తల తాకట్టు పెట్టి అయినా పంట భీమా పధకం ఇప్పిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 1986 లో ఎన్టీఆర్ పెదవేగి లో మొక్క నాటారు. 1990 తర్వాత తెలంగాణ లో వేశామన్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో పామాయిల్ సాగుకు అనుమతులు వచ్చాయన్నారు. టన్ను ఇరవై వేలు ధర ఉండేలా దృష్టి పెడతామన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
అవసరమైతే రాష్ట్రాల అధినేతలతో కలిసి కేంద్రం దగ్గరకి వెళతామని తెలిపారు. వచ్చే నెలలో మరో 13 వందలు పెరుగుతుందని అన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో 20 వేలు కంటే ఎక్కువ వచ్చేలా ప్రణాళిక చేసుకుందామని తెలిపారు. కొత్తగూడెం జిల్లాలో పట్టా ట్రాన్ఫర్ లు ఉండవు గనుక భూమి ఉన్న ప్రతి రైతుకు పామాయిల్ మొక్క అందేలా రెవెన్యూ మంత్రిగారు చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రాలో నర్సరీ లకు విద్యుత్ పరంగా ఉన్న విధి విధానాలు అశ్వారావుపేట నర్సరీలకు ఇవ్వాలని రైతులకు ఇవ్వాలని విద్యుత్ శాఖను కోరుకుంటున్న అని తెలిపారు. అన్నమాట ప్రకారం రైతు భరోసా ఇచ్చే ఏర్పాటు చేసామన్నారు. తల తాకట్టు పెట్టి అయినా పంట భీమా పధకం ఇప్పిస్తామన్నారు.
Lotus Pond: లోటస్ పాండ్ వద్ద అపస్మారక స్థితిలో అర్ధనగ్నంగా యువతి..