NTV Telugu Site icon

Bhadradri: భద్రాద్రి జిల్లా సరిహద్దులోకి పెద్దపులి.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

Bhdradri

Bhdradri

Bhadradri: ములుగు జిల్లా తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న పెద్దపులి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించింది. పినపాక ఇల్లందు కొత్తగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఈ పులి అటు ములుగు జిల్లాలోకి, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు. గత మూడేళ్ల క్రితం కూడా కరకగూడెం ఆళ్లపల్లి రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పర్యటించిందని అన్నారు. అప్పటిలో ఒక ఆవుని కూడా పులి చంపి తిందని, ఆ తర్వాత నుంచి పులి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయని అన్నారు. మళ్ళీ తిరిగి పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Read also: Allu Arjun-Sonu Sood: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన సోనూసూద్.. ఏమన్నారంటే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, అల్లపల్లి మండలాల్లో గత మూడు రోజుల నుండి పులి కలకలం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. గుండాలకు సరిహద్దు అడవులైన ములుగు జిల్లా తాడువాయి మండలంలో పులి సంచరించినట్టు అధికారులు గుర్తించారు. అక్కడి నుండి గుండాల ఆళ్లపల్లి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, అడవుల సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. పులి ఎప్పుడొచ్చి తమను ఏ ప్రమాదానికి గురి చేస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 2020 సంవత్సరంలో ఆళ్లపల్లి మండలం మర్కోడు అడవుల్లో పులి సంచరించి ఓ రైతును, ఎద్దును చంపివేసింది. కొన్ని నెలల తర్వాత టేకులపల్లి మండలంలో సంచరించి వ్యవసాయ పనులకెళ్లిన రైతులను భయాందోళనకు గురిచేసింది.
Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Show comments