NTV Telugu Site icon

Bhadrachalam: శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేడు ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు..

Vhadrachalam

Vhadrachalam

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి శ్రీ లక్ష్మీ తాయారమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం అమ్మవారు ఆదిలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక కుంకుమపూజ నిర్వహించారు. ఈ నెల 12 వరకు రోజూ అమ్మవారిని అలంకరించనున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 12న విజయదశమి సందర్భంగా భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, విజయోత్సవం, ఆయుధపూజ, శ్రీరామలీలా మహోత్సవం నిర్వహించనున్నారు. అక్టోబర్ 17న శబరి స్మృతియాత్ర కూడా నిర్వహించనున్నారు. మరోవైపు రాజన్నసిరిసిల్ల జిల్లాలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నారు. ఈ సందర్భంగా ఇవాళ రెండవ రోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మ చారిణి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ ,చతుష్టోపచార పూజలు, ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేశారు.
Vikarabad: వికారాబాద్‌లో సంచలనం.. ఒకేసారి ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐ లపై వేటు..

Show comments