NTV Telugu Site icon

Ambulance: అంబులెన్స్ లో గంజాయి తరలింపు.. బెడిసికొట్టిన ప్లాన్

Ambulence

Ambulence

Ambulance: గంజాయిని తరలించేందు కోసం అక్రమార్కులు రకరకాలు ఎత్తగడలు వేస్తున్నారు. అచ్చం సినీ ఫక్కీ తరహాలో ఓ అంబులెన్స్​లోనే గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. భద్రాచలం ప్రాంతం నుంచి హైదరాబాద్ వరకు అంబులెన్స్ లో గంజాయి తరలి వెళ్తుంది. కొత్తగూడెం సమీపంలోకి రావడంతో ఇంతలోనే పెద్ద శబ్దం. అంబులెన్స్ కు టైర్ పంచర్ అయ్యింది. అయితే అంబులెన్స్ నిండా గంజాయి ఉంది. పంచర్ వేసుకోవడం ఎలా? అని అటు ఇటు చూస్తున్న గంజాయి తరలించే వారికి ఒక షాప్ కనపడింది. అక్కడకు అంబులెన్స్ ను తోసుకుంటూ వెళ్లి టైర్ పంచర్ అయ్యిందని తెలిపాడు. మెకానిక్ అంబుల్స్ ను చూసిన వెంటనే అనుమానం వచ్చింది.

Read also: Ganesh Immersion: అటు బాలాపూర్‌.. ఇటు ఖైరతాబాద్‌.. రూట్‌మ్యాప్‌ విడుదల చేసిన సీపీ ఆనంద్‌..

అంబులెన్స్ లో ఎవరు కూడా పేషెంట్లు లేకపోవడం వారు పడే హడావుడి చూసిన మెకానిక్ పోలీసులకి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన కొత్తగూడెం సమీపాన వున్న అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. దీంతో రెండవ టౌన్ పోలీస్ వచ్చి అంబులెన్స్ ని డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ లో ఏముందని ప్రశ్నించగా పొంతలేని సమాధానం చెప్పాడు. పోలీసులకు అనుమానం మరింత పెరిగింది. అంబులెన్స్ డ్రైవర్ తో తాళం తీసి చూడగా పోలీసులు షాక్ అయ్యారు. అంబులెన్స్ లో మొత్తం గంజాయి ఉండటం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. అంబులెన్స్ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. అయితే ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఇంకా వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు.
Balapur Laddu: బాలాపూర్ గణేష్ లడ్డు కొన్నాక దశ తిరిగింది.. ఈసారి కూడా రికార్డు సృష్టిస్తా..!

Show comments