వరద ప్రభావంతో తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన వివిధ గ్రామాల వాసులు తమను తెలంగాణలో కలపాలంటున్నారు. తెలంగాణ సహకారం లేకపోతే మా ప్రాణాలు నట్టేట్లో కలిసి పోయేవని గుండాల వాసులు అంటున్నారు.హైదరాబాద్ నుంచి ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా ,రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లే ప్రధానమైన రహదారి పక్కనే గుండాల గ్రామం ఉంది. తెలంగాణ ప్రాంతం తమలో కలపాలని కోరుతున్న ఒక గ్రామంలో ఇది ఒక గ్రామం. అయితే.. కొద్ది రోజులుగా తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాల ప్రజలు ఆదివారం భారీ ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైద్య, విద్య, వ్యాపారపరంగా ఏ విధంగా చూసినా గత కొన్ని దశాబ్ధాలుగా ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మంలతో కొనసాగిన అనుబంధమే తమకు అన్ని విధాల అనుకూలంగా ఉందని, రాష్ట్ర విభజనలో తమను ఏపీలో కలపడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విలీన పంచాయతీల ప్రజలు ఆవేదన వక్తం చేస్తున్నారు. తమను తెలంగాణ పరిధిలోని భద్రాచలంతోనే కొనసాగాలని ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీల వాసులు ముక్తకంఠంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
read also: COVID19 : ఇండియాలో కరోనా కల్లోలం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?
అయితే.. గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు పంచాయతీలను భద్రాద్రిలో విలీనం చేయాలనే డిమాండ్ ఇటీవల వచ్చిన మహావరద ముంపు అనంతరం తెరపైకి వచ్చింది. ఐదు పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని యటపాక మండలం చెన్నంపేట వద్ద భారీ ధర్నా వంటావార్పు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదు పంచాయతీల వాసులతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రెండు ప్రాంతలకు చెందిన రాజకీయపక్షాలు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇందుకోసం ఇప్పటికే నాయకులు క్షేత్రస్థాయిలో ఇంటింటా ప్రచారం చేశారు.
