V.C. Sajjanar: డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్.. జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V.C. Sajjanar: డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్.. జాగ్రత్త అని వీసీ సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. స్లీపర్ సెల్స్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఐఐటీ పీహెచ్డీ స్కాలర్‌కు రూ.30 లక్షల కుచ్చుటోపీ పెట్టారని జాగ్రత్తగా ఉండాలని వీసీ సజ్జనార్ ప్రజలకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. వారు ఎలా మోసం చేస్తారనేది కళ్లకు కట్టినట్టు ఆయన వివరించారు.
హాలో.. మేం ముంబై క్రైం బ్రాంచీ నుంచి మాట్లాడుతున్నాం.
Read also: Rohit Sharma Vs Hardik: ముంబైతో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు చుక్కలు చూపించిన రోహిత్ ఫాన్స్
Also Read
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- RummyCulture Case :రమ్మీకల్చర్‌పై ఈడీ కొరడా.. రూ.442 కోట్ల ఆస్తులు అటాచ్!
మీ పేరుతో FedEx లో ఒక పార్శిల్ బుక్ అయింది. అందులో నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్ ఉన్నాయి. అంతేకాదు, మీకు ఉగ్రవాద మాస్టర్ మైండ్ అయిన మహ్మద్‌తో పలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. మీరు తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారు. అంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పార్శిళ్లలో డ్రగ్స్, తీవ్రవాదులతో బ్యాంక్ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల్లాగానే బిల్డప్ ఇస్తూ.. తమ ఐడీ కార్డులను, ఎఫ్ఐఆర్ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారని వివరించారు.
Read also: War 2: వార్ 2యాక్షన్ సీన్స్ కోసం ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నారా?
తాజాగా ఐఐటీ హైదరాబాద్ పీహెచ్డీ స్కాలర్‌కి ఫోన్ కాల్ చేసి అక్షరాల రూ.30 లక్షలను దోచేశారు. తను ఉగ్రవాదులతో కలిసి జాయింట్ అకౌంట్ తీశారని, అందులో అనుమానస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని చెప్పారు. తన లాప్ టాప్‌ను, ఫోన్‌ను ఉగ్రవాదులు హ్యాక్ చేశారని భయపెట్టారు. ఉగ్రవాద స్లీపర్ సెల్స్ తో తన కుటుంబానికి ప్రాణహానీ ఉందని, హౌజ్ అరెస్ట్ చేస్తున్నామంటూ చెప్పి 6 రోజుల పాటు ఇంట్లోంచి బయటకు రాకుండా చేశారు. ఈ కేసులతో తనకేం సంబంధం లేదని చెప్పిన వినకుండా భయభ్రాంతులకు గురిచేశారు. జాయింట్ అకౌంట్లో అనుమానస్పద లావాదేవీలున్నాయని, వాటిని పరిశీలించాలని మాయమాటలు చెప్పారు. తన కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న రూ.31 లక్షలను తమ బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు.
Read also: Bhadradri Mahotsavam: నేటి నుంచి శ్రీరామ నవమి కల్యాణానికి ఆన్లైన్ టికెట్ల విక్రయాలు..
లావాదేవీలు సక్రమంగా ఉంటే ఆ నగదును తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. తర్వాత వారు స్పందించలేదు. చివరికి మోసపోయానని గుర్తించిన ఆ ఐఐటీ పీహెచ్డీ స్కాలర్.. సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నన్ను వ్యక్తిగతంగా కలిసి మోసపోయానని వాపోయారు. ఇలాంటి నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన ఉన్నత విద్యావంతలే.. మోసాలకు గురవడం బాధాకరం. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్శిళ్ల పేరుతో ఫోన్ కాల్స్ కానీ, ఐవీఆర్ కాల్స్ వస్తే వాటికి అసలే స్పందించవద్దు. వారికి ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. డ్రగ్స్ కేసు అని, ఉగ్రవాదులతో సంబంధాలని బెదిరించగానే భయపడి డబ్బులు బదిలీ చేయొద్దు. మీరు ఒకవేళ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930 ఫోన్ చేయండి. లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.
*డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసుల ఫోన్ కాల్స్.. జాగ్రత్త!
*ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ కాల్స్
*స్లీపర్ సెల్స్ నుంచి ప్రాణహాని అంటూ బెదిరింపులు
*ఐఐటీ పీహెచ్డీ స్కాలర్‌కు రూ.30 లక్షల కుచ్చుటోపీ
''హాలో.. మేం ముంబై క్రైం బ్రాంచీ నుంచి మాట్లాడుతున్నాం. మీ పేరుతో FedEx… pic.twitter.com/tUEYA3QhDr
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 24, 2024
JNUSU Election : ఏబీవీపీకి షాక్.. జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎగిరిన లెఫ్ట్ జెండా
తాజావార్తలు
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!