NTV Telugu Site icon

Karimnagar: గ్రేట్‌ సార్‌.. రైతును 2 కిలోమీటర్లు మోసిన కానిస్టేబుల్

Karimnagar Crime

Karimnagar Crime

Karimnagar: కరీంనగర్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఓ రైతును ప్రాణాలు కాపాడిన తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తుంది. విధుల్లో వున్న కానిస్టేబుల్ కు ఓ రైతు పురుగుల మందు తాగడంలో స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న కానిస్టేబుల్.. రైతును భుజాలపై వేసుకుని రెండు కిలోమీటర్లు నడిచి ప్రాణాలు కాపాడాడు.. ఈఘటనతో కానిస్టేబుల్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read also: Chiranjeevi: రమణ గాడి ఇంటికి విశ్వంభర

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన కుర్ర సురేష్ బుధవారం ఇంట్లో గొడవపడి తన పొలానికి వచ్చాడు. జీవితంలో విసుగుచెందిన రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. అక్కడున్నవారు గమనించి 100కు సమాచారం అందించగా.. వెంటనే బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అంబులెన్స్ కు కాల్ చేసి అది వచ్చి తీసుకునే వెళ్లే సరికి రైతు ప్రాణాలు మిగలవని భావించి.. వెంటనే కానిస్టేబుల్ జయపాల్ అతడిని భుజాన వేసుకుని పొలాల మీదుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సాయంతో జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైతు సురేష్ కు వైద్యులు వెంటనే వైద్యం అందించారు. ప్రస్తుతం సురేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సకాలంలో సురేష్ ను కాపాడిన బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌, ఇతర సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు. జయపాల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సురేష్ ప్రాణాలు కాపాడినందుకు కుటుంబ సభ్యులు జయపాల్ ను కాల్లుపట్టుకుని కృతజ్ఞతలు తెలిపి, కన్నీరుమున్నీరుగా విలపించారు.
TS sheep Scam: గొర్రెల పంపిణీ స్కాం.. ఏసీబీ కస్టడీలో ఆ నలుగురు..!