NTV Telugu Site icon

MLA Chinnaiah: టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే చిన్నయ్య

Chinnayya

Chinnayya

MLA Durgam Chinnaiah: మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివరణ ఇచ్చారు. NTV తో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. నేను మాట్లాడే ప్రయత్నం చేశాను.. ఎవ్వరి పైన దాడి చేయలేదన్నారు. మేనేజర్ ఎవ్వరు అని అక్కడున్న వ్యక్తి ని అడిగానని తెలిపారు. రోడ్ పూర్తి కాక ముందే టోల్ డబ్బులు ఎందుకు అడుగుతున్నారనే విషయంలో అధికారులకు ఫొన్ చేసి నిభందలను అడిగే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు. రోడ్డు పనులు పూర్తి అయ్యాక టోల్ డబ్బులు అడగాలని వారికి తెలిపానని, అంబులెన్సు లను డబ్బులు అడుగుతున్నారని మండిపడ్డారు. నేను దాడి చేశా అనేది అవాస్తమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.

Read also: Vasantha Krishna: ఉయ్యూరు శ్రీనివాస్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు.. భయపెడితే ఎలా..?

అయితే.. ఇవాళ మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్‌గేట్ వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వీరంగం సృష్టించారంటూ వార్తలు చర్చనీయాంశంగా మారాయి. తను వెలుతున్న వాహనాలను టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. టోల్ ప్లాజా సిబ్బందిపై చేయి చేసుకున్నారని, తన కారుకు రూట్ క్లియర్ చేయలేదని మండిపడ్డారంటూ వచ్చిన వార్తలపై వాస్తవం లేదన్నారు. టోల్ ప్లాజా సిబ్బందిపై బూతులు తిడుతూ అక్కడున్న వారిని భయ భ్రాంతులకు గురిచేశారనడం కరెక్ట్ కాదన్నారు. కారు దిగి నానా హంగామా చేశారని, దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికాడ్డు కావడంతో.. ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. అయితే.. మరొకపక్క టోల్‌గేట్ సిబ్బందే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరుల వెల్లడించారు. కావాలనే ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారని, రూట్ క్లియర్ చేయలేదని ఆరోపించారు. అయితే దీనిపై వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే స్పష్టం చేయడంతో.. టోల్ ప్లాజా సిబ్బందిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. టోల్ ప్లాజా పనులు పూర్తి కాకుండా డబ్బులు కటుకోవడం ఏంటని మండిపడ్డాతున్నారు.
Insulin Plant: ఇన్సూలిన్ మొక్కతో షుగర్ కంట్రోల్