Site icon NTV Telugu

Bear Carcass: కొమరంభీం జిల్లాలో ఎలుగుబంటి కళేబరం కలకలం..

Komaram Bheem

Komaram Bheem

Bear Carcass: కొమరంభీం జిల్లాలోని పెంచికల్ పేట మండల అగర్ గూడ అడవుల్లో ఎలుగుబంటి మృతి చెందింది. ఎలుగుబంటి కళేబరాన్ని గుర్తించిన అధికారులు పశు వైద్యుల సమక్షంలో పంచ నామాకు తరలించారు. ఎలుగు బంటి పై దాడి చేసినట్లుగా గాయాల ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. ఎవరైనా ఆత్మరక్షణలో భాగంగా చంపేశారా? ఉచ్చులు పెట్టారా? లేక విద్యుత్తు షాక్ తో హతమర్చారా?. అనే విషయం పై అధికారులు ఆరా తీసున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read also: MLC Jeevan Reddy: బీఆర్‌ఎస్‌ పార్టీని బీజేపీ దగ్గర కుదవపెట్టారు.. కేసీఆర్‌ పై జీవన్‌ రెడ్డి ఫైర్‌

అయితే ఎలుగు బంటి ఇక్కడకు తరుచూ వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సమాచారంతో అధికారుల ఘటన స్థలానికి చేరుకున్నామని అన్నారు. అయితే ఎలుగు బంటి ఎవరికైనా ప్రాణహాని చేసిందా? వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగింది ఇదే మొదటి కావడం గమనార్హం. అయితే ఎలుగు బంటి కళేబరాన్ని చూసిన స్థానికులు భాయాందోళన చెందుతున్నారు. ఎలుగు బంటి పరిసరప్రాంతాల్లో తిరుగుతుందని ప్రాణహాని ఉందని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Nellore Crime: నెల్లూరులో దారుణం.. పెళ్లికి నిరాకరించిన యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి

Exit mobile version