Site icon NTV Telugu

ఈటలను రెండో సీఎంగా.. కేసీఆర్ చూసుకున్నారు..

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను రెండో సీఎంగా, సొంత తమ్ముడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకున్నారన్నారని..బీజేపీ మత తత్వ, రెచ్చగొట్టే, విభజించి పాలించే పార్టీ అని అన్నారు. హుజురాబాద్ లో TRS పార్టీ కార్యాలయంలో రజక కుల సంఘం నాయకులతో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితేల సతీశ్ కుమార్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. కష్టపడి గెలిపించిన టీఆర్ఎస్ నాయకులను కాదని, తండ్రి లాంటి కేసీఆర్ ను ధిక్కరించి పోయారన్నారని ఫైర్ అయ్యారు. ఈటల TRS నుంచి బయటకు వెళ్ళి తన బొంద తానే పెట్టుకున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ ను, TRSనే అందరం నమ్ముకోవాలని ఆయన కోరారు.

Exit mobile version