Site icon NTV Telugu

Basara IIIT: గేటు వ‌ద్ద ప‌డిగాపులు.. రాత్రినుంచి కొన‌సాగుతున్న‌ చ‌ర్చ‌లు..

Iiit Students

Iiit Students

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) విద్యార్థుల ఆందోళన ఏడవ రోజుకు చేరింది. మెయిన్ గేటు వద్ద విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కాగా.. ఆరో రోజైన ఆదివారం వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద 24 గంటలపాటు రాత్రీపగలూ బైఠాయింపు చేపట్టారు. దీంతో జిల్లా కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ రాత్రి 11 గంటల తర్వాత క్యాంపస్‌కు వచ్చారు. కొత్త డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌తో కలిసి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లకు ఒప్పుకుంటుందని, ఏమేం అవసరమో పైనుంచి అడిగారని వివరించారు.సోమవారం తరగతులకు హాజరుకావాలని, హామీలు అమలు చేసేలా మంగళవారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి తొలుత విద్యార్థులు నో చెప్పినా.. కలెక్టర్‌ విజ్ఞప్తి మేరకు చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి ఒకటిన్నర తర్వాత కూడా ఇదే ప్రతిష్టంభన కొనసాగుతోంది.

కాగా.. ఆదివారం ఉదయం హైదరాబాద్, నిజామాబాద్‌లకు చెందిన ఏబీవీపీ నాయకులు వర్సిటీవైపు దూసుకురాగా, పోలీసులు అడ్డుకుని లాక్కెళ్లారు. వివిధ జిల్లాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆందోళనలు చేపట్టారు. ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో విద్యార్థులు 24 గంటల దీక్షకు సిద్ధమయ్యారు. శాంతియుత పద్ధతుల్లో రోజుకో తీరులో నిరసనలు చేపడుతున్నారు. యోగా వారోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం కాసేపు యోగా, ధ్యానం చేసి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వినాలంటూ.. ‘సారూ.. దిగిరారె.. చూడరె మా ఆవేదనలను..’అంటూ ఓ పాటను రూపొందించి ట్విట్టర్‌లో పెట్టారు. ఆర్జీయూకేటీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ట్రిపుల్‌ ఐటీ సమస్యల పరిష్కారం కోసం ఓ వైపు తాము నిరవధిక ఆందోళన చేస్తుంటే.. అధికారులు మాత్రం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు

Astrology: జూన్ 20, సోమవారం, దినఫలాలు

Exit mobile version