NTV Telugu Site icon

Durgam chinnayya: హైదరాబాద్‌ లో ఫ్లెక్సీల కలకలం.. దుర్గం చిన్నయ్యపై వెలిసిన బ్యానర్లు

Mla Durgam Chinnayya

Mla Durgam Chinnayya

Durgam chinnayya: హైదరాబాద్‌ లో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై హైదారాబాద్ లో బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రత్యక్షమవడంతో సంచలనంగా మారింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ , మీడియా సంస్థల అధినేతలు విన్నపము అంటూ మాకు న్యాయం చేయాలని ప్లీక్సీలో ఉంది. స్త్రీల రక్షణ కల్పించాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుండి బెల్లంపల్లి నియోజవర్గ ప్రజలను కాపాడండి అంటూ.. వివిధ ఆరోపణలతో ఆరిజన్ డెయిరీ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు తీవ్ర కలకలం సృస్టిస్తున్నాయి. బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు పెట్టడంతో ఈ వ్యవహారం కాస్త సంచలనంగా మారింది. హైదరాబాదులోని పలు చౌరస్తాలలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఫ్లెక్సీలు దుమారం రేపుతున్నాయి. రాత్రి రాత్రే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై పలు ఆరోపణలతో బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శనమివ్వడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా బీఆర్ఎస్ భవన్, మీడియా కార్యాలయాల వద్దే ప్లెక్సీలు, బ్యానర్లు ప్రత్యక్షమవడంతో తీవ్ర సంచలనంగా మారింది.

తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో (మే8)న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పలుచోట్ల స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. పోస్టర్లపై ‘బై బై చిన్నయ్యా… గుడ్ బై చిన్నయ్య’ అని రాసి ఉంది. బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గం పేరుతో ప్రచురించిన ఈ పోస్టర్లలో ఎమ్మెల్యే చిన్నయ్య అవినీతి, అక్రమాలు, మహిళలపై వేధింపులపై రాశారు. తాజాగా, ఓ ప్రైవేట్ డెయిరీ కేసులో తనపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన క్లిప్పింగ్‌లను పోస్టర్లలో ముద్రించారు. ఎమ్మెల్యే వలపు చేష్టలు.. అభివృద్ధికి, అవినీతికి, భూకబ్జాలకు, మహిళలపై వేధింపులకు చరమగీతం పాడి “బై బై చిన్నయ్య గుడ్ బై చిన్నయ్య” అని రాశారు. ఎమ్మెల్యే డర్టీ పిక్చర్.. ప్రజాప్రతినిధిగా ప్రజాసేవ మరిచి నీ బలహీనతతో బెల్లంపల్లి ప్రజల పరువు తీశాడంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి.

అప్పట్లో బెల్లంపల్లి ఎమ్మెల్యేపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. చిన్నయ్య తమను నమ్మి మోసం చేశాడని చెప్పింది. వారి నుంచి డబ్బులు తీసుకుని జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేసింది. డెయిరీ ఏర్పాటుకు తొలుత దుర్గం చిన్నయ్య వద్దకు వెళ్లినట్లు ఆమె తెలిపారు. డెయిరీని ఏర్పాటు చేయండి కానీ.. తమకు తెలిసిన వారికి వాటా ఇవ్వాలని కోరినట్లు వివరించారు. అలా చేస్తే తన సపోర్ట్ తో ఏం చేస్తే అది చేస్తానని ఎమ్మెల్యే చెప్పినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రతిపాదనను సంబంధిత వారికే ఇచ్చామన్నారు. రెండెకరాల భూమి కూడా ఇచ్చామని చెప్పింది. వ్యాపార విషయాలపై చిన్నయ్యను కలిసేందుకు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లేవారని ఆమె తెలిపారు. ఈ క్రమంలో తమతో పాటు తమ కంపెనీలో పనిచేసే ఓ అమ్మాయిని కూడా తీసుకెళ్లారు. తనను చూసిన ఎమ్మెల్యే తనకు పంపాలని కోరినట్లు యువతి తెలిపింది. అందుకు వారు అంగీకరించలేదు. ఒత్తిడి చేయడంతో చేసేదేమీ లేక దళారీ నంబర్లు చెప్పి అతడికి పంపించామని చెప్పింది. యువతి ఆరోపణలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఖండించారు.

Himanta Biswa Sarma: అస్సాంలో మరో 300 మదర్సాలను మూసివేస్తాం..