Site icon NTV Telugu

Canara Bank: బ్యాంకులో బంగారం గోల్ మాల్.. బ్యాంక్ అధికారి చేతివాటం..

Mulugu Canara Banl

Mulugu Canara Banl

Canara Bank: ములుగు జిల్లా మంగపేట మండలంలోని రాజుపేట కెనరా బ్యాంక్ శాఖలో ఖాతాదారులకు చెందిన బంగారం భారీ ఎత్తున గోల్ మాల్ జ‌రిగిన‌ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజుపేట కెనరా బ్యాంక్ శాఖ పరిధిలోని వందలాది మంది రైతులు, వ్యాపారులు తమకున్న వ్యవసాయ, వాణిజ్య, వ్యాపారాల నిమిత్తం బ్యాంకులో తమ బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు తీసుకున్నారు. కాగా.. సుమారు రూ.1.44 కోట్ల విలువ చేసే దాదాపు 2 కిలోల117 గ్రాముల మేర బంగారంను సదరు బ్యాంక్ అప్రైజర్ తన చాకచక్యంతో కొట్టేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే.. కెనరా బ్యాంకు శాఖలో ఇటీవల వారం రోజులుగా వార్షిక ఆడిట్ జరుగుతున్న క్రమంలో ఖాతాదారులు గత ఏడాది తాకట్టు పెట్టిన బంగారం నిల్వలను తనిఖీ చేస్తున్న ఆడిట్ అధికారులకు సదరు నిల్వలకు తాకట్టు లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరలేదు.

Read also: Fire Accident : ఉత్తరప్రదేశ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో భారీగా మంటలు.. తొక్కిసలాట

అయితే.. దీంతో అనుమానం వచ్చిన ఆడిట్ అధికారులు ఈ విషయాన్ని బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్యాంక్ మేనేజర్ షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకు మేనేజర్ బ్యాంక్ అప్రైజర్ ను సంప్రదించాడు. అయితే.. బ్యాంక్ అప్రైజర్ ప్రశాంత్ అప్పటికే గ్రామం నుంచి కుటుంబంతో సహా ఉడాయించినట్లు తెలుస్తోంది. ఆడిటర్ల గుర్తింపుతో నాలుగు రోజుల క్రితమే బ్యాంక్ గోల్డ్ అప్రెజర్ ఉడాయించినట్లు విశ్వనీయ సమాచారం. పోలీసులకు బ్యాంక్ ఉన్నతాధికారుల ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన బ్యాంక్ ఖాతాదారులు ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రశాంత్ కోసం గాలిస్తున్నారు.
Fire Accident : ఉత్తరప్రదేశ్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో భారీగా మంటలు.. తొక్కిసలాట

Exit mobile version