Bandi Sanjay: పంట నష్టంతో చేసిన అప్పులు తీరే పరిస్థితి లేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తో కౌలు రైతు నారాయణ కన్నీటి పర్యంతమయ్యాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం శివారులో అకాల వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతు దెబ్బడ నారాయణ పొలాన్ని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. తనకున్న 2 ఎకరాల పొలంతోపాటు మరో 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నానని నారాయణ తెలిపాడు. అకాల వర్షాలతో 5 ఎకరాల వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, తాలు మాత్రమే మిగిలిందని నారాయణ కుటుంబం వాపోయింది. ఎకరాకు రూ.10 వేలు కౌలు పైసలివ్వడంతోపాటు పెట్టుబడి కింద రూ.లక్షన్నర ఖర్చు చేశానని నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు.
Read also: Komatireddy Venkat Reddy: ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది..
పంట నష్టంతో చేసిన అప్పులు తీరే పరిస్థితి లేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని కౌలు రైతు నారాయణ కన్నీటిపర్యంతమయ్యారు. కౌలు రైతు నారాయణ కుటుంబానికి బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని బండి సంజయ్ చెప్పారు. అనంతరం ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి బయలుదేరారు. సిరిసిల్ల నియోజకవర్గం పోతుగల్ గ్రామంలో పంట నష్టపోయిన పొలాలను బండి సంజయ్ పరిశీలించారు. పంట నష్టపోయిన బాధిత రైతుల నుండి వివరాలు సేకరించారు. పంట నష్టపోయి కన్నీరు మున్నీరైతున్న రైతులను పరామర్శించారు. తమకు చావే శరణ్యమని… ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Top Headlines@1PM: టాప్ న్యూస్