Bandisanjay-Revanthreddy: ఢిల్లీలో బడ్జెట్ సమావేశాలు వేళ ఆసక్తికర సన్నివేశం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మాటల తూటాలు పేల్చే నాయకులు ఢిల్లీలో షేక్ హ్యాండ్ లు ఇస్తూ కనిపించారు. వారెవరో కాదండోయ్ తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అలాంటి నాయకులు పరస్పరం ఒకరినొకరు చూసుకుని చిరునవ్వులు చిందించారు. నవ్వుతూ పలకరించుకుని సేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. తరచూ ఒకరిపై మరొకరు సంచలన ఆరోపణలు చేసుకునే ఇరు పార్టీలకు చెందిన ఈ నేతలిద్దరూ సరదాగా సంభాషించుకోవడం ఆశక్తికరంగా మారింది. రేవత్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు ధర్మపురి అర్వింద్ పలువురు ఎంపీలు కూడా అక్కడ ఉండటం విశేషం.
Read also: Formula E: ఫిబ్రవరి 11, 12న ఫార్ములా ఈ రేసింగ్.. ఎన్‌టీఆర్ మార్గ్ పూర్తిగా క్లోజ్
బడ్జెట్ సమావేశాల నిమిత్తం వీరందరూ పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. ఒకరినొకరు ఎదురెదురు రావడంతో.. ఒకరి మొహం మరొకరు చూసుకుంటూ చిరునవ్వు చిందించారు. బండి సంజయ్ స్వయంగా వెళ్లి రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వడం అక్కడ అంతా ఆశక్తి కరంగా మారడంతో.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తుంది. ఒకరిపై ఒకరు పరస్పరం ఎప్పుడు తిట్టుకుంటూ మీడియా ముందు కనిపించే నేతలు ఇలా నవ్వుకుంటూ చేతులు కలపడం ఏంటని కొందరు నెటిజన్లు అంటుంటే.. మరికొందరు ఎన్ని విరోధాలు వున్నా ఎదురుపడితే హాయ్ నమస్తే అంటూ పలకరించుకోవడం ఇలా విరోధుల్లా మట్లాడుకునే నేతలు చేతులు కలుపుతూ చిరున్వుతో మాట్లాడటం చాలా బాగుందని అంటున్నారు. అయితే మరొకొందరైతే మండిపడుతున్నారు. ఇక్కడ మాటల తూటాలు.. ఢిల్లీలో షేక్ హ్యాండ్ లా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏదైతేనే ఢిల్లీలో బడ్జెట్ సమావేశాలకు కలిసిన ఈ అరుదైన సన్నివేశం ఆశక్తికరంగా మారింది.
Read also: Etela Rajender: పార్టీ నుండి నేను వెల్లలేదు.. వేళ్ళగొట్టారు..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్‌సభలో కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం పార్లమెంట్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ కు బడ్జెట్ లో నిధులు లేవా అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. మోదీ, మీరు గుజరాత్ సీఎం కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. నిధుల కేటాయింపులో గుజరాత్‌కు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వండి. మోదీ అన్యాయం చేస్తుంటే సస్పెండ్ చేయాల్సిన బీఆర్‌ఎస్ సభలో నిస్సహాయంగా నిలబడింది. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కేంద్రంతో పోరాటానికి దిగారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర..
ఫిబ్రవరి 6న తెలంగాణలోని ములుగు సమ్మక్క సారక్క ఆలయ ప్రాంగణం నుంచి ‘హత్ సే హత్ జోడో’ యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.ఈ యాత్రలో వివిధ సందర్భాల్లో జాతీయ స్థాయి నాయకత్వం కూడా పాల్గొంటుందని తెలిపారు. తొలి విడతగా 60 రోజుల పాటు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని, ఆ తర్వాత కొనసాగించే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.