NTV Telugu Site icon

Bandi Sanjay: అందుకే వద్దని చెప్పా.. కేంద్ర మంత్రి పదవిపై బండి ఆసక్తికర వ్యాఖ్యలు..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నానని.. పదవికన్నా ప్రజలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలే సీఎం అవుతారన్నారు. మోడీ మాట నిలబెట్టుకుంటే ఎస్సీ వర్గీకరణ కచ్చితంగా జరుగుతుంది. రేషన్ కార్డులు, ఇళ్లు, ఉద్యోగాలు ఇవ్వని మంత్రి గంగుల కమల్కర్‌కు కరీంనగర్‌లో ఓట్లు అడిగే అర్హత లేదని ఈ సందర్భంగా సంజయ్ విమర్శించారు. కరీంనగర్‌లో మార్పు రావాలంటే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Read also: Kartarpur Gurdwara: క‌ర్తార్‌పూర్ గురుద్వారాలో డ్యాన్స్ పార్టీ.. సిక్కులు తీవ్ర ఆగ్రహం

వేములవాడ రాజన్న తన ఇలవేల్పు అని పలు వేదికలపై చెప్పిన కేసీఆర్ వేములవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఇంటి దేవుడిని పూజించే సంస్కృతి కేసీఆర్‌కు ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చెన్నమనేని వికాస్ కు మద్దతుగా బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న అభ్యర్థులకు ఘనస్వాగతం పలికారు. రాజన్న గుడి దగ్గర ప్రజలనుద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. వేములవాడ అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ తరపున డాక్టర్ చెన్నమణి వికాస్ పోటీచేస్తున్నారని, కాంగ్రెస్, బీఆర్ ఎస్ లాగా దోచుకోవాలనే ఉద్దేశం ఆయనకు లేదన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ వేములవాడ అభివృద్ధికి చేసిందేమీ లేదు. దర్గా కట్టించినా సీఎం కొడుకు నాస్తికుడు, హిందూ వ్యతిరేకి అని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తాను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే… బాబ్రీ మసీదు కూల్చివేతపై కేసీఆర్ మాట్లాడుతున్నారని, తాను కరసేవలో పాల్గొన్నానని గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు.
Rashmika Mandanna: బ్లాక్ శారీ లో మురిపిస్తున్న రష్మిక మందన్న..

Show comments