NTV Telugu Site icon

Balmoori Venkat: భుజాలు తడుము కుంటారు ఎందుకు..! కేటీఆర్‌పై బల్మూరి వెంకట్‌ కీలక వ్యాఖ్యలు

Balmoori Venkat

Balmoori Venkat

Balmoori Venkat: కేటీఆర్ తప్పు చేయకపోతే.. గుమ్మడి దొంగ లెక్క భుజాలు తడుము కుంటున్నారు అంటూ ఎమ్మెల్యే బల్మూరి వెంకట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ షాడో సీఎం గా పని చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ రాజకీయాలకు వాడుకున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తప్పు చేయకపోతే.. గుమ్మడి దొంగ లెక్క భుజాలు తడుము కుంటున్నారు ఎందుకు? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చిన్న సమస్య అని ఎందుకు అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రంగం వారి ఫోన్లు ట్యాప్ సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్, ప్రత్యర్థుల ఫోన్ లు ట్యాప్ చేశారని మండిపడ్డారు. తప్పు చేసిన వారు.. కటకాటాలో కి వెళ్తారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజం.. విచారణ లో అన్నీ తెలుతాయన్నారు. కేటీఆర్ తొందర పడుతున్నారని అన్నారు.

Read also: Kishan Reddy: మోడీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు..

పోలీసు అధికారులు విచారణలో చెప్తున్నారు కదా ట్యాపింగ్ చేశాం అని అన్నారు. ఐపీఎల్ టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారు.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. తుక్కుగుడా సభకు యువత.. నిరుద్యోగ యువత తరలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని తెలంగాణలో క్షేత్ర స్థాయికి ఎన్ఎస్ యూఐ తీసుకువెళ్తుందన్నారు. ఈనె 8వ తేదీ నుండి నియోజక వర్గ స్థాయి సభలు ప్రారంభమవుతాయన్నారు. ప్రతీ రోజు రెండు నియోజక వర్గాల్లో సభలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు… ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాకా ఏం చేయబోతోంది అనేది వివరిస్తామన్నారు.
Koona Srisailam Goud: బీజేపీకి షాక్‌.. కాంగ్రెస్‌ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్‌