Site icon NTV Telugu

Balkampet Yellamma : బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రులు

Balkampet

Balkampet

Balkampet Yellamma : హైదరాబాద్‌ బల్కంపేట్‌లోని మహిమాన్విత ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు అమ్మవారిని పెళ్లికూతురిలా అలంకరించి, పుట్ట మన్నుతో ఎస్ఆర్ నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపు జరిపారు. ఈ వేడుకను భక్తులు భారీ సంఖ్యలో తిలకించారు.

AP BJP President: ఇవాళ ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన!

ఇవాళ ఉదయం 9 గంటలకు ఎల్లమ్మ తల్లి కళ్యాణ క్రతువు ప్రారంభం కానుంది. ప్రభుత్వ తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ ఉత్సవాల ముగింపుగా జూలై 10న సాయంత్రం 6 గంటలకు రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

హైదరాబాద్ ప్రధాన మార్గాల నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఆర్టీసీ ద్వారా 80 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అంతేగాక, రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఉత్సవాన్ని తిలకించేందుకు సమాచార శాఖ ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసింది. ఆసక్తి గల భక్తులు ఈ లింక్ ద్వారా ప్రత్యక్షంగా అమ్మవారి కల్యాణాన్ని వీక్షించవచ్చు: https://youtube.com/live/b2ynYRwggGc ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ పాలకులు కోరుతున్నారు.

Thammudu : ‘తమ్ముడు’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?

Exit mobile version