Site icon NTV Telugu

Balka Suman : చంచల్‌గూడలో చిప్పకుడు తిన్న 420 రేవంత్

ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌ మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీకి తెలుగు రాదు… వీళ్ళు ఎవరో పంపితే పోస్టు చేసినట్టు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ నిలబడలేదని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసారని, విషయం లేక ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి మొహం చాటేశారన్నారు.

లోపయికరికంగా బీజేపీకి కాంగ్రెస్ చిత్తుశుద్ధితో సహకరిస్తుందని, బీజేపీకి అవుట్ సోర్సింగ్ ఏజెంట్‌లా రేవంత్ పనిచేస్తున్నట్టు ఉందని విమర్శించారు. సోనియా బలి దేవత అని గతంలో రేవంత్ అన్నాడని, తెలంగాణలో బీజేపీకి రేవంత్ సహకరిస్తున్నారన్నారు. బజారు మనిషిలా మాట్లాడారు రేవంత్ అని, పెయింటర్ రెడ్డి నుంచి పెయిడ్ రెడ్డి అయ్యారు రేవంత్ అని, రేవంత్ ది నకిలీ… మకిలి చరిత్ర అని తీవ్రంగా విమర్శించారు. చంచల్‌గూడలో చిప్పకుడు తిన్న 420 రేవంత్ అని ఆయన ధ్వజమెత్తారు.

https://ntvtelugu.com/ipl-2022-updates-kkr-vs-rcb/
Exit mobile version