Telangana Auto Drivers: ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం.. ఈనెల 16న మహాధర్నాకు పిలుపు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Auto Drivers: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకంలో భాగంగా డిసెంబర్ 9 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇప్పటి వరకు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే మహిళలు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ఎదురు చూస్తున్నారు. దీంతో బస్సుల్లో సీటు దొరకడం లేదు. ఈ పథకం అమల్లోకి రాకముందు రోజూ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 12 లక్షలు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుంది. మహిళలు ఎక్కువగా జీరో టికెట్ తీసుకుని బస్సుల్లో ప్రయాణిస్తుండటంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు. ఆటోలు ఎక్కే వారు కరువయ్యారు. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉందని వారు భావిస్తున్నారు. ప్రయాణికులు లేక రోజువారి ఆదాయానికి గండి పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: Autos Allowed on Yadadri: యాదాద్రి కొండపైకి ఆటోల అనుమతి.. ఎప్పటి నుంచి అంటే..
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు ఆటోడ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమయ్యారు. మద్దతు కోరేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా కలిశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16న ఆటోల బంద్ కు సిద్ధమయ్యారు. ఆ రోజు ఒక్క ఆటో కూడా రోడ్డెక్కకూడదని డ్రైవర్లు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Australian: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో తొలిసారి భగవద్గీతపై ప్రమాణం చేసిన ఎంపీ..
తాజావార్తలు
-
Bank Account: ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు? ఎక్కువ ఖాతాలు ఉంటే లాభమా? నష్టమా?
-
Aadhaar Mobile Number Update: ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. కొంచం ఇష్టం.. కొంచం కష్టం
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!