NTV Telugu Site icon

Hyderabad Crime: కూతురిని కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్.. స్కెచ్ వేసి హత్య చేసిన తల్లిదండ్రులు..

Borabanda Crime

Borabanda Crime

Hyderabad Crime: కని పెంచిన మమకారం ఆ తల్లిదండ్రులను హంతకులు గా మార్చింది.. ఒక్కగానొక్క గారాల బిడ్డను మాయమాటలతో అపహరించుకెళ్లిన యువకుడిని బాలిక తల్లిదండ్రులు హతమర్చారు. సినీ ఫక్కీలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి రావడంతో పోలీసులు షాక్‌ తిన్నారు.

ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన ఓ కారు డ్రైవర్‌ తన భార్య, కూతురుతో కలిసి జగద్గిరి గుట్టలో నివాసం ఉంటున్నారు. ఏడో తరగతి చదువుకుంటోంది. అయితే తన కూతురుని కుమార్‌ అనే కుమార్‌ అనే ఆటో డ్రైవర్‌ ట్రాప్‌ చేశాడు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మబలికి బాలికను కిడ్నాప్ చేశాడు. యూసఫ్‌గూడలోని ఓ గదిలో నిర్భంధించి లైంగిక వేధింపులకు గురి చేశాడు. బాలిక అక్కడి నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్లిందో తల్లిదండ్రులు వెతికినా ఆచూకీ దొరకలేదు. అయితే బాలికను ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేశాడని ఆటోడ్రైవర్‌ ను హత మార్చాలని బాలిక తల్లిదండ్రలు స్కెచ్‌ వేశారు. స్నాప్ చాట్ ద్వారా భార్యతో కలిసి హనీ ట్రాప్ చేశారు. ఆటో డ్రైవర్ కుమార్ ను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి కూతురు గురించి చెప్పమని అడిగారు.

తన నుంచి తప్పించుకున్న సంఘటన గురించి చెప్పాడు. దీంతో వారి దెబ్బలు తట్టుకోలేక కుమార్‌ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సూర్యాపేట వైపు కారులో తీసుకెళ్లి కాళ్లకు, చేతులకు పెద్ద బండను కట్టి సజీవంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వలోకి తోసేశారు. దీంతో కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత కారు డ్రైవర్ కూతురు తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు. అయితే, కుమార్ ఆటో నడుపుతుండగా, కుమార్ బంధువులు ఆటో బంపర్‌ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు, ఇది కేసులో కీలక మలుపు తిరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు గుర్తుతెలియని మృతదేహం ఎముకలను డీఎన్‌ఏ కోసం సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆటోడ్రైవర్ హత్యకేసులో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు విచారణ చేపట్టారు.
Chiranjeevi : సర్దార్ డైరెక్టర్ కు మెగాస్టార్ ఛాన్స్.. ?

Show comments