NTV Telugu Site icon

Rachakonda Crime: రాచకొండ పరిధిలో దారుణం.. వ్యక్తి పై ఇనుప రాడ్డులతో కత్తులతో దాడి

Rachakonda Crime

Rachakonda Crime

Rachakonda Crime: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ఆర్టీసీ కాలనిలో దారుణం చోటుచేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి అశోక్ ను దారుణంగా కత్తులతో దాడి చేసి గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

అశోక్ వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాంపల్లి లోని అర్.టి. సీ కాలనీ లో నివాసం ఉంటున్నారు , నారాయణపేట జిల్లా ఔరంగపుర్ గ్రామనికి చెందిన అశోక్ , గత నాలుగు సంవ్సరాలుగా ఆర్.టి. సీ కాలనీలో తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు, సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో అశోక్ ఇంటి వద్ద నలుగురు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేని ఫోర్డ్ కారులో వచ్చి ఇనుప రాడ్డులతో కత్తులతో అశోక్ పై దాడి చేశారు. స్థానికులు హుటాహుటిన ఈసీఐల్ శ్రీకార ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రీతం అశోక్ పై హత్య యత్నం చేశారని మల్కాజ్ గిరి డిసిపి జానకి తెలిపారు.

ఈ దాడికి పాత కక్షలే కారణం అని ప్రాథమిక దర్యాప్తలో నిర్ధారించారు. నారాయణపేట జిల్లా మరికల్ ప్రాంతంలో 2019 సంవత్సరంలో ఆశప్ప అలియాస్ అశోక్ పై హత్య యత్నం జరిగినట్లు తెలిపిన పోలీసులు. మరికల్ పోలీస్ స్టేషన్ లో ఈ హత్య యత్నంకు సంబందించిన కేసు నమోదు అయినట్లు పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు భూ తగాదాల కారణంగా గతంలో హత్య యత్నం చేశారని, అప్పటి నిందితులు అయిన ఆంజనేయులు, విజయ్ కుమార్ లను ఈ హత్యతో సంబందం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు.
CM JaganMohan Reddy: కావలిలో సీఎం జగన్ పర్యటన.. చుక్కల భూములకు పట్టాల పంపిణీ

Show comments