NTV Telugu Site icon

Breaking News : టీఆర్‌ఎస్‌ నేత బ్రహ్మయ్యపై దాడి.. కారు ధ్వంసం

Trs

Trs

ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్, టీఆర్ఎస్ నేత, మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్యపై కొంత మంది దాడికి పాల్పడ్డారు.. అశ్వాపురం మండలం నెల్లిపాక డీసీసీబీ సొసైటిలో ఉండగా పాల్వంచ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న సత్యనారాయణ ఈ దాడికి పాల్పడ్డారు. గత మూడు రోజుల నుంచి ఓ భూ వివాదం కు సంబంధించి మాట్లాడాల్సి ఉందని సత్యనారాయణ కాల్ చేస్తుండగా నెల్లిపాక సొసైటికి బ్రహ్మయ్య వచ్చారు.

ఈ సందర్బంగా సత్యనారాయణ పలువురితో సొసైటి కార్యాలయానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సత్యనారాయణతో వచ్చిన వారు బ్రహ్మయ్య పై దాడికి పాల్పడ్డారు. బ్రహ్యయ్య క్రింద పడిపోయాడు. ఆ తరువాత బ్రహ్మయ్యకు చెందిన కారు బయట ఉండగా కారు అద్దాలను కూడ ధ్వంసం చేశారు. బ్రహ్మయ్యను క్రింద పడవేయడంతో.. బ్రహ్మయ్య ఎదురు దాడికి పాల్పడ్డారు.