Hyderabad: పాపకు కంట్లో నలక పడిందంటే సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ప్రాణం తీశారు..
- ఉప్పల్ లో దారుణం..
- కంట్లో నలక పడిందని హాస్పిటల్ వెళ్తే పాప ప్రాణం తీసిన ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్..
- సర్జరీ చేయాలని.. ముక్కు ద్వారా అనస్థీషియా ఇచ్చిన వైద్యులు..
- డోస్ ఎక్కువవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన హన్విక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ఉప్పల్ లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారి కంట్లో నలక పడిందని ఆసుపత్రికి వెళితే ప్రాణం తీసిన ఘటన నగరంలో కలకలం రేపింది. హన్విక కుటుంబ సభ్యులు బీరంగూడ లో నివాసం ఉంటున్నారు. ఇంటిముందు ఆడుకుంటుండగా కంట్లో కర్ర ముక్క గుచ్చుకుంది. దీంతో హన్విక తల్లిదండ్రులు వెంటనే చందనగర్ లోని ఆనంద్ ఐ హాస్పిటల్ తీసుకెళ్ళారు. హన్వికకు ఐ డ్రాప్స్ వేసి ఆనంద్ ఐ హాస్పిటల్ సిబ్బంది ఇంటికి పంపారు. కాసేపటికి చందానగర్ హాస్పిటల్ సిబ్బంది హన్విక తల్లిదండ్రులకు కాల్ చేసి.. హబ్సిగూడ లో ఉన్న తమ మెయిన్ బ్రాంచ్ కి వెంటనే పాప ను తీసుకెళ్ళాలని సూచించారు. దీంతో కంగారు పడ్డ హన్విక తల్లిదండ్రులు హుడాహుడిగా.. హబ్సిగూడ ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లారు. హన్వికకు సర్జరీ చేయాలని ముక్కు ద్వారా అనస్థీషియా ఇచ్చారు. డోస్ ఎక్కువవడంతో హన్విక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో హన్వికకు ఆనంద్ హాస్పిటల్ సిబ్బంది మళ్లీ హుటాహుటిన ఎల్బీ నగర్ రెయిన్ బో కి తరలించారు.
Read also: Pimple: మొటిమలు గిల్లితే ఇన్ఫెక్షన్ అవుతుందా..?
Also Read
- CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్‌కు తెలంగాణ రెడీ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
- Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?
అయితే హన్విక ఆరోగ్య పరిస్థితిపై ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బందికి విచారించగా.. రెయిన్ బో ఆసుపత్రికి తరలించారని తెలిపారు. కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా పాపను ఎలా వేరే ఆసుపత్రికి తరలిస్తారని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదు. ఇక హన్విక కుటుంబ సభ్యులు వెంటనే రెయిన్ బో హాస్పిటల్ వద్దకు వెళ్లి హన్విక ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. రెయిన్ బో ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. వారివద్దకు రాక ముందే పాప హన్విక మృతి చెందిందని తెలిపారు. దీంతో హన్విక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కంట్లో నలక పడిందని వస్తే సర్జరీ చేయాలని చెప్పి ఇప్పుడు పాప మృతదేహాన్ని అప్పగిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హన్విక మృతదేహాన్ని తీసుకుని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Bhatti Vikramarka: మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ.. రాజధానిలో కార్నివాల్, లేజర్ షో
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..