NTV Telugu Site icon

Jagital Crime: పెళ్లైన ప్రేయసితో టచ్‌లో ప్రియుడు.. గొడ్డలితో నరికిన యువతి బంధువులు

Jagital Crime

Jagital Crime

Jagital Crime: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అందరి ప్రేమకథలో జరిగినట్లే ఇతని ప్రేమ కథకు బ్రేక్ పడింది. ప్రియుడి ప్రేమకు ప్రియురాలి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ప్రియురాలిని వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అటు ప్రియురాలిని దూరం ఉండలేకపోయాడు ప్రేమికుడు. అయితే అమెకు పెళ్లి అయిపోయినా కూడా టచ్ లోనే ఉంటూ రోజూ ఫోన్ చేసి మాట్లాడే వాడు. అయితే కొద్దిరోజులు బాగానే ఉన్నా ఈ విషయం కాస్తా అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్మాయి బంధువులు ఆ యువకుడిని నడి రోడ్డుపై గొడ్డలితో కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌కు చెందిన జువ్వికింది వంశీ తుంగూరులోని డ్రైవింగ్ స్కూల్‌లో పనిచేస్తున్నాడు. గతంలో వంశీ, అదే మండలానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో యువతికి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. యువతికి పెళ్లయిన తర్వాత కూడా వంశీ తరచూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. వారు కలుస్తున్నారని బాలిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వంశీని పలుమార్లు హెచ్చరించారు. అయినా కూడా వంశీలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆవేశంతో రగిలిపోయారు. ఆదివారం కొల్వాయి నుంచి తుంగూరుకు ద్విచక్రవాహనంపై వెళుతున్న వంశీని అడ్డుకున్నారు. గొడ్డళ్లు, ఇతర ఆయుధాలతో తలపై దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వంశీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

వంశీ హత్య విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వంశీ మృతి చెందిన ప్రదేశానికి వచ్చిన వారు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. పోలీసులు వంశీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని తరలిస్తే చనిపోతామంటూ వంశీ తల్లి భాగ్య లారీకింద వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారితీయకుండా డీఎస్పీ ప్రకాష్, అలీ, సారంగాపూర్, రాయికల్ ఎస్సైలు తిరుపతి, అజయ్యలు మృతుడి బంధువులతో చర్చించారు. ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వంశీ కుటుంబ సభ్యులు శాంతించారు. తన కొడుకు వంశీని.. యువతి తండ్రి రమేష్, సోదరుడు విష్ణు హత్య చేశారని వంశీ తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే వంశీ వద్ద ఫోన్ కనిపించకపోవడంతో.. హంతకులు తీసుకెళ్లి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంశీ తండ్రి శ్రీహరి ఉపాధి నిమిత్తం ముంబైలో ఉంటున్నాడు. తల్లి కూలి చేస్తుంది. అయితే వంశీ హత్యతో జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
Telangana Rain: నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్