NTV Telugu Site icon

Modi posters: మరోసారి మోడీ పోస్టర్ల కలకలం.. ఇంకా ఎన్ని సంవత్సారాలు అంటూ..

Modi Poster

Modi Poster

Modi posters: నగరంలోని ఉప్పల్‌-నారపల్లి వద్ద మోడీ వాల్‌ పోస్టర్లు కలకలం రేగాయి. మోడీ గారు ఈ ఫ్లైఓవర్‌ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు అంటూ పీఎం మోడీ వాల్‌పోస్టర్‌ దర్శనం ఇచ్చాయి. 2018 మే 05న కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. అయితే ఇప్పటికి 5ఏండ్లు పూర్తి అవతున్న ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ 40 శాంత కూడా పూర్తీ కాలేదని పోస్టల్‌ లో ముంద్రిచారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఉన్న ప్లైఓవర్ పిల్లర్లకు పోస్టర్స్ అంటించారు గుర్తుతెలియని వ్యక్తులు  పిల్లర్లపై మోడీ వాల్‌పోస్టర్లు దర్శనమివ్వడంతో చర్చనీయాంశంగా మారింది. ఐదు సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు పిల్లర్లు మాత్రమే పడ్డాయి.. ఈ ఫ్లైఓవర్ కోసం తీసిని గుంతల వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్లైఓవర్ పనులపై మంత్రి కేటీఆర్ కు ఓ నెటిజన్ కూడా ట్వీట్ ట్యాగ్ చేయడంతో మంత్రి రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే.. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనంటూ ట్వీట్ వైరల్ గా మారింది. ఇది మోడీ ప్రభుత్వం వల్లే ఈ నిర్మాణం జరగడం లేదని వెలసిన వాల్ పోస్టర్లలో స్పష్టం చేయడంతో నగరంలో కలకలం రేపుతోంది. మరి దీనిపై బీజేపీ నాయకులు ఎలా స్పందించనున్నారు అనేదానిపై ఆశక్తి నెలకొంది.

2018 మే నెలలో కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ శంకుస్థాపన..

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు రూ.626.76 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్​కారిడార్ నిర్మించాలని నిర్ణయించగా దీనిని 2018 మే నెలలో కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ శంకుస్థాపన చేశారు.  అయితే.. ఈ ఫ్లైఓవర్ రామంతాపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్​ పవర్​రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వద్ద ముగుస్తుంది. ఇక.. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాగా.. ఎలివేటెడ్​కారిడార్ కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంతో సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే.. ఈ ప్లై ఓవర్ పనులు 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని టార్గెట్​పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు జరగలేదు. ఇప్పటికి ఐదేండ్లు పూర్తి కావస్తున్న ఈపనులు  పిల్లర్లు వరకు మాత్రమే పూర్తిచేశారు. కాగా.. ప్రీ-కాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ ​ఏర్పాటు నత్తనడకగా సాగుతున్నాయి. ఇక్కడ మొత్తం  148 పిల్లర్లలో128 పిల్లర్లు వేయగా.. మిగిలినవి వేయాల్సి ఉంది. ఇక నారపల్లి వద్ద ఓ ఐదారు పిల్లర్లపై మాత్రమే ఇప్పటివరకు స్లాబు వేయగా పిల్లర్ల ఏర్పాటు కోసం ఎక్కడికక్కడ తవ్విపోయడంతో రోడ్డంతా గుంతల మయంగా మారింది. వాహనాలు వెళ్తున్నప్పుడు దుమ్ము రేగుతోంది. ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇంకా ఎన్నాల్లు ఈపనులు అంటూ చిరాకు పడుతున్నారు.  ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపోగా పనులు మరింత రద్దీగా మారుతున్నాయి. ఫ్లైఓవర్ పనుల కోసం తవ్విన మట్టి, రోడ్లపై గుంతలు, వాహనాలు ఎగిసిపడే దుమ్ముతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది.

నెటిజన్ ప్రశ్న.. మంత్రి సమాధానం..

ఇక తాజాగా ఇదే విషయమై ఉప్పల్ ఫ్లై ఓవ‌ర్ ప‌నుల‌పై ఓ నెటిజ‌న్ ఉప్పల్ ఫ్లై ఓవ‌ర్ ఎప్పుడు పూర్తవుతుంది స‌ర్.. ప‌నులు చాలా మెల్లగా కొన‌సాగుతున్నాయి. నార‌ప‌ల్లి నుంచి సిటీలోకి వ‌చ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని నెటిజ‌న్.. కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. నెటిజన్‌ ట్వీట్‌ కు ఆయ‌న కూడా ట్విట్టర్ వేదిక‌గానే స్పందిస్తూ.. ర‌హ‌దారుల అభివృద్ధి విష‌యంలో కేసీఆర్ ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేనంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఉప్పల్, అంబ‌ర్‌పేట ఫ్లై ఓవ‌ర్ల ప‌నులు దుర‌దృష్టావ‌శాత్తు నేష‌న‌ల్ హైవేస్ ఆధ్వర్యంలో కొన‌సాగుతున్నాయి. ఈ రెండు ఫ్లై ఓవ‌ర్లకు జీహెచ్ఎంసీ భూములు కేటాయించిన‌ప్పటికీ ప‌నులు న‌త్తన‌డ‌కన కొన‌సాగుతున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీ ద్వారా ఎస్ఆర్డీపీ కింద 35 ప్రాజెక్టులు చేప‌ట్టి.. అనతి కాలంలోనే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామ‌న్నారు. కానీ కేంద్రం చేప‌ట్టిన రెండు ప‌నులు మాత్రం పూర్తి కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదేన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.