Site icon NTV Telugu

Ask KTR : మ‌రోసారి ఆస్క్‌ కేటీఆర్‌ @ 12 pm

Ktr1

Ktr1

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మ‌రోసారి ఆస్క్ కేటీఆర్ (Ask KTR) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు మంత్రి కేటీఆర్. మీతో ముచ్చటించడానికి ఎదురుచూస్తున్నానని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దీనిలో నెటిజన్లు వారికి సంబంధించిన వివరాలు, సూచనలు అందించాలని కోరారు.

అయితే తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‘ఆస్క్‌ యువర్‌ కేటీఆర్‌’ కార్యక్రమాన్ని జనవరి 13, 2022లో నిర్వహించిన విషయం తెలిసిందే.. ఆతరువాత సభలు, ర్యాలీలు, మీటింగ్ లతో బాగా బిజీ అయ్యారు మంత్రి కేటీఆర్. కాగా.. జనవరిలో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ లో ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్న వార్తల్లో నిలిచింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో డిబేట్‌లో పాల్గొనాలని కోరిన నెటిజన్ కు కేటీఆర్‌ తనదైన శైలీలో జవాబు ఇచ్చారు. ‘క్రిమినల్స్‌తో డిబేట్‌లో పాల్గొననని సమాధానం ఇచ్చారు’. అప్పట్లో ఆవార్త షోషల్ మీడియాలో వైరల్ గా మరింది.

తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న పరిణాలకు మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న ‘ఆస్క్‌ యువర్‌ కేటీఆర్‌’ కార్యక్రమం ఆసక్తి కరంగా మారింది. నెటిజన్లు వేసే ప్రశ్నలకు మంత్రి సమాధానం ఎలా వుంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Telangana :పెట్రోల్ కోసం పక్క రాష్ట్రానికి పయనం

Exit mobile version