Asifabad Bus accident: బస్సులు నడుపుతున్న డ్రైవర్లు తగు జాగ్రత్తగా తీసుకోకపోతే ప్రమాదాలకు గురి కావాల్సిందే. వాళ్లు చేసే చిన్న తప్పు పలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంది. చిన్న అజాగ్రత్తగా ఉన్న వారు డ్రైవర్ తో ప్రయాణికులు సైతం మృత్యువాత పడే పరిస్థితులు ఎదురవుతున్నారు. ఇలాంటి ఘోరమై ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ లో చోటుచేసుకుంది.
Read also: MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులతో ఉన్న బస్సు బయలు దేరింది. కాస్త ముందుకు వెళ్లిన బస్సు డ్రైవర్‌కు విపరీతమైన ఛాతిలో నొప్పివచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ బస్సునుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. కాసేపు బాగానే ప్రయాణిస్తున్న బస్సు ఒకసారిగా క్రాస్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కానీ బస్సు డ్రైవర్ బస్సులో లేడు. బస్సు ఎటువెలుతుందో తెలియని ఆయోమయంలో ప్రయాణికులు వున్నారు. దీంతో బస్సు ఆసిఫాబాద్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో ఆర్టీసి హైటెక్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులకు ఉన్నారు. బస్సు పక్కనే వెలుతున్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానిక సమచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యం అందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బస్సు డ్రైవర్ కిందికి దూకేసాడా? లేక ఛాతి నొప్ప రావడంతో బస్సు నుంచి కిందికి పడిపోయాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
Revanth Reddy: పాదయాత్రకి బయలుదేరిన రేవంత్.. హారతి ఇచ్చిన కూతురు నైనిషా..