Arvind Kejriwal Speech In Khammam BRS Party Public Meeting: ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. 2024 ఎన్నికల్లో దేశమంతా కలిసి బీజేపీని తరిమికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉందన్నారు. బీజేపీ నియమించిన గవర్నర్లంతా రాజకీయం చేస్తున్నారని.. ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి గవర్నర్లకు ఒత్తిడి ఉందని, ఆ గవర్నర్లను మోడీనే ఆడిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే ఈ గవర్నర్ల పని అన్నట్లుగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవున్నా.. దేశం వెనుకబడే ఉందని పేర్కొన్నారు. కానీ.. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన సింగపూర్ మాత్రం దూసుకెళ్తోందన్నారు. మనమేం పాపం చేశామని వెనుకబడిపోతున్నామని ప్రశ్నించారు.
Dutee Chand: డోప్ టెస్టులో పట్టుబడ్డ భారత స్టార్ స్ప్రింటర్
తాము ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటున్నామని.. ఢిల్లీ మొహల్లా క్లినిక్ మంచి ఫలితాన్నిస్తోందని.. వాటిని చూసే సీఎం కేసీఆర్ ఇక్కడ బస్తీ దవాఖానాగా అమలు చేశారని కేజ్రీవాల్ తెలిపారు. మొహల్లా క్లినిక్‌ల పరిశీలనకు కేసీఆర్ ఢిల్లీ గల్లీలో తిరిగారని.. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ పాఠశాలలు పరిశీలించారని అన్నారు. ఢిల్లీలో పాఠశాలల పరిస్థితిని చూసిన తర్వాత తమిళనాడులోనూ పాఠశాలలు బాగు చేసుకున్నారన్నారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారన్నారు. కేరళలో విద్య, వైద్యం బాగుంటుందని చిన్నప్పటి నుంచి విన్నానని.. అలాంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా తాము చాలా నేర్చుకున్నామన్నారు. కంటి వెలుగు కార్యక్రమం, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతమని ప్రశంసించారు. కంటి పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయమని.. ఈ కార్యక్రమాల్ని తాము ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించారు.
Akhilesh Yadav: బీజేపీ కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఆ పార్టీని తరిమికొట్టండి