NTV Telugu Site icon

కేసీఆర్ హుజూరాబాద్ సభకు భారీ ఏర్పాట్లు

హుజూరాబాద్ లో ఉప ఎన్నికకు షెడ్యూల్ రాకముందే.. పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే పలువురు మంత్రులు సైతం నియోజకవర్గంలో పర్యటించి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఇరువురి మాటల తూటాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభాస్థలిని మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. దళిత బంధు పథకంపై ఈ సభలో కేసీఆర్ ఎక్కువగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు కూడా ప్రచారానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించనుంది.