NTV Telugu Site icon

High Interest: అధిక వడ్డీతో వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసి బాధితుడు ఆత్మహత్య..

Selfi Vedio Susaid

Selfi Vedio Susaid

High Interest: అధిక వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడిన రుద్రబోయిన మహేందర్ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో చోటుచేసుకుంది. మహేందర్ ఆత్మహత్యకు ముందు, సూసైడ్ లెటర్, సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది.

Read also: Raja Singh: దమ్ముంటే అడ్డుకోండి.. పోలీసులకు రాజాసింగ్ సవాల్..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం 2023 లో శామీర్ పేట్ గ్రామానికి చెందిన దూడల నాగేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అందులో నుంచి రూ.4 లక్షల 70 వేల రూపాయలను చెల్లించాడు. అయితే నాగేష్ దగ్గరకు వెళ్లిన మహేందర్ ఇంకా అప్పు తీర్చడానికి ఎంత డబ్బు ఉందని అడిగాడు. అదేంటి నువ్వు అప్పు ఎప్పుడు కట్టావు. రూ.6 లక్షలు అప్పు అలానే ఉంది. నువ్వు కట్టిన డబ్బులు కేవలం మిత్తి మాత్రమే అని, అసలు రూ.6 లక్షల రూపాయలు అలాగే ఉన్నాయని తనకు మొత్తం రూ.6 లక్షలు చెల్లించాలని తెలిపాడు.

మహేందర్ రూ.4 లక్షల 70 వేల రూపాయలను చెల్లించానని వాదించాడు. దీంతో నాగేష్ కోపంతో మహేందర్ ను వేధింపులకు గురి చేసాడు. దీంతో మనస్తాపం చెందిన మహేందర్ సూసైడ్ నోట్ రాసి, బాధతో సెల్ఫీ వీడియో తీసుకొని, తుర్కపల్లి లోని తన స్క్రాప్ దుకాణంలో దూలానికి నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. నాగేష్ వేధింపుల వల్లనే మహేందర్ ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడి కుటుంబీకులు ఆరోపించారు. నాగేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు.
TS State Emblem: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఇదేనా..? ఫొటో వైరల్..

Show comments