NTV Telugu Site icon

చెరువులో లభ్యమైన అనీష్‌ మృతదేహం.. అసలేం జరిగింది..?

రాజేంద్రనగర్‌లోని హైదర్‌ గూడకు చెందిన అనీష్ మిస్సింగ్‌ మిస్టరీ విషాదాంతమైంది. నిన్న మధ్యాహ్నం ఆడుకునేందుకు అపార్ట్‌మెంట్ సెల్లార్‌కు వెళ్లిన అనీష్‌ కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని అనీష్‌ తల్లిదండ్రులు సాయంత్రం గుర్తించి పోలీసులకు ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా అనీష్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ముందుగా ఓ మహిళ కిడ్నాప్‌ చేసినట్లు భావించిన పోలీసులు అది నిజం కాకపోవడంతో హైదర్‌ గూడ పరిసరాలను తనిఖీ చేశారు.

దీంతో అపార్ట్‌మెంట్ వెనుక గల చెరువులో అనీష్‌ మృతదేహం లభ్యమైంది. బాలుడి ఒంటిపై బట్టలు లేవని, చెరువు గట్టు పై టీ షర్ట్ , నిక్కర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, ఈత కోసం నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గా ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.