NTV Telugu Site icon

Rangam Bhavishyavani 2022: రంగం భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. ఏం చెప్పారంటే..

Rangam Bhavishyavani 2022

Rangam Bhavishyavani 2022

సికింద్రాబాద్‌ లో లక్సర్‌ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. రంగంకోసం సర్వం సద్దం చేసారు అధికారుల. రంగంలో అమ్మవారి భవిష్యవాని ప్రారంభమైంది. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించిన అమ్మవారు రంగంలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నన్ను సంతోషంగా చేయడం లేదని, మీ సంతోషం కోసం పూజలు చేయండి, సరిగ్గా పూజలు జరపడం లేదని పేర్కొన్నారు. ప్రతీ ఏటా చెబుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. నాకు సక్రమంగా పూజలు జరిపించండి, శాస్త్రోక్తంగా నిర్వహించండని అన్నారు.

నేను మీ హృదయాల్లో దూరి కాపాడుతున్నాను అయినా నన్ను మీరు సంతోషంగా పూజలు జరిపించడంలేదని అన్నారు. ఏటికేటా నా రూపాన్ని మారుస్తున్నారని మండిపడ్డారు. నాకు స్థిరమైన రూపం కావాలని, నాది అంతా కాజేస్తున్నారంటూ ఆగ్రమం వ్యక్తం చేశారు. నేను సంతోషంగా లేను అయినా కూడా మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూస్తున్నానని అన్నారు. నా గర్భగుడిలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని తెలిపారు. నాపిల్లలైన గర్భణీ స్త్రీలకు, ఆడపిల్లకు తన కడుపునపెట్టుకుని చూసుకుంటున్నానని పలికారు. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను అని అన్నారు.  మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని, గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదని అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేసారు.

వర్షాల గురించి మాట్లాడుతూ.. గర్భాలయంలో శాస్త్రీయబద్దంగా పూజలు నిర్వహించాలని, తనబిడ్డలే అని ఇప్పటివరకు తాను సరిపెట్టుకుంటున్నారని అన్నారు. మీరు కళ్లు తెరవడానికే తాను కుంభవృష్టి వర్షాలు కురిపించానని, ఇప్పటికైనా తనకు సంతోషంగా పూజలు చేయాలని అన్నారు. గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, మీరు సరిగ్గా పూజలు చేస్తున్నారా? అంటూ అమ్మవారు ప్రశ్నించారు. మీకు కనువిప్పు కలిగేందుకే ఈ కుంభవృష్టి వానలు కురిపిస్తున్నాని తెలిపారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు జరిపించాలని కోరారు.