Site icon NTV Telugu

Andela Sriramulu: పథకాల పేరుతో మోసం చేశారు.. ఎన్నికల ప్రచారంలో అందెల శ్రీరాములు

Andela Sriramulu Yadav

Andela Sriramulu Yadav

Andela Sriramulu: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ఎన్నికలకు 8రోజులు సమయం ఉండటంతో పార్టీ నేతలంతా ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. పగలు రాత్రి అనే తేడాలేకుండా ఇంటింటికి వెళుతూ ప్రజలకు పార్టీ చేసే అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటు వేయాలని ముందుకు సాగుతున్నారు. ఈనేపథ్యంలోనే మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించలని ప్రజలను కోరారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అందెల శ్రీరాములు ధ్వజమెత్తారు.

Read also: World Cup Impact: ఒక్క రోజులోనే రికార్డు సృష్టించిన విమానయాన రంగం

ఎంఐఎం కోటాలో మంత్రి పదవి పొందిన సబితా ఇంద్రారెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని అందెల శ్రీరాములు తెలిపారు. దళిత బంధు,బీసీ బంధు, గృహలక్ష్మి పథకం అంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. లోకల్ వ్యక్తిగా, మహేశ్వరం నియోజకవర్గంలో సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తున్నారని శ్రీరాములు అన్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని అందెల శ్రీరాములు ఆరోపించారు. బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీర్ పేట్ డివిజన్ పరిధిలోని న్యూ గాయత్రినగర్ లో కొలువైన కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Bandi Sanjay: ఫస్ట్ కు జీతాలు ఇవ్వలేరు కానీ.. మళ్లీ అధికారిమా..! కేసీఆర్ పై బండి ఫైర్

Exit mobile version