Site icon NTV Telugu

Amit Shah: మత ఘర్షణల రికార్డ్‌ కాంగ్రెస్‌ దే.. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి..

Amith Shah Hyderabad

Amith Shah Hyderabad

Amit Shah: కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు… వాళ్లు బీఆర్ఎస్ లో చేరారని.. బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తే అవినీతికి పాల్పడిందని.. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వండని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మత ఘర్షణల రికార్డ్ కాంగ్రెస్ ది… బీజేపీ ఎక్కడ అధికారం లో ఉన్న వీటిని అణచి వేస్తుందని అన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ తో సిద్ధాంత పరమైన, రాజకీయ పరమైన పొత్తులు ఎప్పుడు ఉండవన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత అవినీతిపై విచారణ చేసి దోషులను జైల్ కి పంపిస్తామన్నారు. ఎంఐఎం పాలస్తీనా అంశం చెప్పకుండా ఇంకేమి చెప్పి ఓట్లు అడుగుతుందన్నారు. మాదిగ వర్గీకరణను స్పీడ్ అప్ చేసేందుకే కమిటీ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. రోయింగ్యలపై ఎన్ఐఏ ఆక్షన్ తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడ వాళ్లు కేసీఆర్ కి ఓటు బ్యాంక్… మా దృష్టిలో రోహింగ్యాలు దేశ ద్రోహులు అన్నారు. పీఎస్ యూ లను అమ్మాలని అనేది మా విధాన పరమైన నిర్ణయమన్నారు. తెలంగాణలో పబ్లిక్ సెక్టార్ యూనిట్ లను అమ్మమని, ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని అన్నారు. ఎంఐఎం ఓటును ఈ సారి కాంగ్రెస్ తీసుకోబోతుంది.. అసద్ కి కాంగ్రెస్ భయం పట్టుకుందని తెలిపారు. రైతు బంధు నీ మేము ఆపమని షా అన్నారు.

Read also: D Raja: బీజేపీ హటావో… దేశ్ బచావో.. మోడీ పాలనా వైఫల్యాలను ప్రజలు గమనించారు..!

మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఈ పదేళ్ళలో అప్పుల తెలంగాణగా మారిందన్నారు. యువత, మహిళలు, అన్ని వర్గాలు ఈ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర, దేశ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా మోడీ కి, కమలం గుర్తుకు ఓటు వేస్తారన్నారు. లిక్కర్, గ్రానైట్, మియాపూర్ భూములు, ఓఆర్ఆర్ ఇలా ఈ ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని అన్నారు. దళిత బందు డబ్బులను బీఆర్ఎస్ కార్యకర్తల తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. దీంతో కేసీఆర్ విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. సినిమా, ఫార్మా, ఎడ్యుకేషన్ సిటీలని ఏర్పాటు చేస్తానని చేయలేదన్నారు. మేము ఇచ్చిన హామీలు ఈ 9 ఏళ్లలో నెరవేర్చామన్నారు. 370 ఆర్టికల్ ఎత్తేసామని తెలిపారు. అయోధ్యలో రామాలయం, ట్రైబల్ తలక్ , గ్రామీణ రోడ్లు, ప్రతి పేద వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం, ఇల్లు ఇలా ఎన్నో చేస్తామని తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేకంగా 4 శాతం ముస్లిం రిజర్వేషన్ లు ఇచ్చారని తెలిపారు. వీటిని ఎత్తి వేస్తామని స్పష్టం చేశారు. ఆ రిజర్వేషన్ లు బీసీ, ఎస్సీ, ఎస్టీ లకి ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
D Raja: బీజేపీ హటావో… దేశ్ బచావో.. మోడీ పాలనా వైఫల్యాలను ప్రజలు గమనించారు..!

Exit mobile version