Site icon NTV Telugu

హుజురాబాద్‌లో బీజేపీనే గెలిపించాలి : అమిత్‌ షా

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. నిర్మల్‌ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేసిన ఆయన… మజ్లిస్‌ పార్టీకి భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు అమిత్‌ షా. నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్‌ షా.. కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారు. అధికారం కారుదే అయినా.. స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమన్నారు.తెలంగాణలో బీజేపీ బలం అంతకంతకూ పెరుగుతోందన్నారు అమిత్‌ షా. 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచామనీ.. ఈసారి మొత్తం సీట్లు బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రపై ప్రశంసలు కురిపించారు అమిత్‌ షా. కుటుంబ పాలనను అంతమొందించడమే సంగ్రామయాత్ర లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వాన్ని మరింత బలపర్చాలన్న అమిత్‌ షా… హుజురాబాద్‌లోనూ బీజేపీనే గెలిపిలించాలని పిలుపునిచ్చారు.

Exit mobile version