Site icon NTV Telugu

Bigala Ganesh : నిజామాబాద్‌లో సాఫ్ట్ వేర్ రంగం పుంజుకుంటుంది

T Hub

T Hub

నిజామాబాద్ టీ-హబ్ ను అమెరికాకు చెందిన వైటల్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ప్రతినిధుల, టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ అధ్యక్షులు బిగాల మహేష్ గుప్తా, ఎమ్మెల్యే బిగాల గణేష్ సందర్శించారు. ఈ సందర్భంగా బిగాల గణేష్ మాట్లాడుతూ.. టీ-హబ్ ను అమెరికాకు చెందిన ప్రతినిధులు సందర్శించారని, ఇక్కడి యువతకు ఉపాధి కల్పించడానికి ఐటీ హబ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఇక్కడి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామని ఆయన వెల్లడించారు. అమెరికా కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని, హైదరాబాద్, బెంగుళూరు తర్వాత నిజామాబాద్ లో సాఫ్ట్ వేర్ రంగం పుంజుకుంటుందన్నారు. నైట్ షిఫ్ట్ లలో పని చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఒక పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

Exit mobile version