Alleti Maheshwar Reddy: భద్రాద్రి రామయ్య కోలువైన కోవెల ఖమ్మం గుమ్మంలో ఎగిరేది కషాయపు జెండానే అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట ఖమ్మం అని.. కళ్లబొల్లి మాటలతో కాంగ్రెస్ వాళ్లు కబ్జా చేశారని ఇప్పుడు కదనరంగంలోకి కషాయ దళం వచ్చిందన్నారు. 60 ఏండ్లు ఆగం చేశారని, ఉద్యమ పార్టీకి అధికారం ఇస్తే ఉన్నదంతా ఊడ్చేశారని అన్నారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో అందినంత దోచుకున్నారు, దాచుకున్నారని మండిపడ్డారు. గ్యారంటీల పేరుతో, వారంటీలపేరుతో… డేట్లు, డెడ్ లైన్లు పెట్టి, ప్రజలను నమ్మించి మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు హస్తం పార్టీ నాయకులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నానాబోస్తే పుచ్చి బూరెలైనట్లు ఉంది, కాంగ్రెస్ నాయకుల పాలన అని మండిపడ్డారు. హస్తం పార్టీ 60 రోజుల పాలనలోనే ప్రజలకు అసలు విషయం అర్థమైందన్నారు. 412 హామీలు వాళ్లు అధికారంలోకి రావడానికి వాడుకున్న మాటలేతప్పా…నిజంగా ప్రజలకు కోసం కాదన్నారు. స్వయంగా ఈజిల్లానాయకులే ఉపముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనే అసలు బండారం బయటపడిందన్నారు.
Read also: Mahalakshmi Scheme: రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం.. పూర్తి డబ్బు చెల్లించాల్సిందే..!
మాట ఇచ్చినట్లుగా హామీలు అమలు చేయాలంటే, ప్రతీ హామీకి నిధులు కేటాయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి ఉండే, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేది ఉండే అన్నారు. బడ్జెట్ లో ప్రభుత్వం ఏం చెప్పిందో….ఏం చేసిందో..ఎంత కేటాయింపులు చేసిందో మీరు కూడా చూశారన్నారు. రెవెన్యూ మంత్రిగా ఉన్న పొంగులేటి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ప్రాజలకైనా సమాధానం చెప్పాలన్నారు. 412 హామీలు కాదు కదా, కనీసం వారు అనుకుంటున్న ఆరు హామీలకు కూడా నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేయబోతున్న విషయాన్ని సభా సాక్షిగా బయటపెట్టిందన్నారు. డిసెంబర్ 9నే రుణమాఫీ, వందరోజుల్లోనే హామీలు పూర్తి చేస్తాం, ఫిబ్రవరిలోనే జాబ్ క్యాలండర్ వేస్తాం, ఇలా డేట్లు డెడ్ లైన్లు పెట్టింది కాంగ్రెస్ నాయకులే అని తెలిపారు. ఇప్పుడు ఆ డేట్లు, డెడ్ లైన్ గడువు ముగిశాయి. ఇంకోన్ని రోజులైతే 100డేస్ డైడ్ లైన్ వస్తుందన్నారు. గ్యారంటీలు, వారంటీలు అంటూ మీరు చెప్పినప్పుడు ఏమైందని ప్రజలు అడగడంలో తప్పులేదన్నారు.
Read also: Rythu Bandhu: రైతు బంధు, భీమా పక్కదారి నిజమేనా..! క్లారిటీ ఇచ్చిన సైబరాబాద్ సీపీ..
దానికి అధికారంలోనే ఉన్న మీరే అసహనానికి గురైన హామీలు అడిగితే చెప్పుతో కొట్టండనే దాకా వచ్చారంటే.. ఓట్లేసిన ప్రజలపై మీకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ, అడవిబిడ్డల నేల ఖమ్మం అన్నారు. ఇక్కడి ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎక్కువ సీట్లు ఇచ్చారు, ఇప్పుడు నమ్మిన ప్రజలను హామీలు అమలు చేయకుండా నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా.. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరి వాస్తవాలు బయటపట్టే వరకు, ప్రజలపక్షంగా ప్రతిపక్షంగా బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు, మళ్లీ లోక్ సభ ఎన్నికల ముందు మళ్లీ మీ ఇండ్ల ముందుకొస్తారన్నారు. హామీలపై అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి, మీకు అండగా బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్