NTV Telugu Site icon

SI Attack Police: మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన ఎస్సైపై వేటు.. కేసు నమోదు

Si Tirupati Attack Police Mancherial

Si Tirupati Attack Police Mancherial

SI Tirupati Attack Police Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెజ్జంకి ఎస్ ఐపై కేసు నమోదు చేశారు. బెజ్జంకి ఎస్ ఐ తిరుపతితో పాటు 8 మంది పై కేసు నమోదు చేశారు. అర్థరాత్రి నడి రోడ్డు పై తన స్నేహితుల తో కలిసి మద్యం సేవించి ఎస్ ఐ తిరుపతి వీరంగం సృష్టించాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్ళ పై దుర్భాషలాడి, దాడి చేశాడు. బెజ్జంకి ఎస్.ఐ తిరుపతితో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు అధికారులు. 294b,323,324,332,506r/w149 వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు అధికారులు.

Read also: Goods Train Derail: పట్టాలు తప్పిన గూడ్సు రైలు.. 53 వ్యాగన్లు బోల్తా

బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నానన్న విషయాన్ని మరచి ఫుల్‌ గా మద్యం సేవించాడు ఓ ఎస్సై. తన స్నేహితులతో కలిసి బ్లూకోర్ట్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అక్కడకు చేరుకుని నిలదీయటంతో జారుకున్నాడు. ఈఘటన మంచిర్యాల జిల్లా అంబేద్కర్‌ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ తిరుపతి, తన స్నేహితులతో కలిసి హల్‌ చల్‌ చేశాడు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన తిరుపతి కమిషనరేట్‌ పరిధిలోని బెజ్జంకి పోలీస్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న రాత్రి (మంగళవారం) ఎస్సై తిరుపతి తన స్నేహితులతో కలిసి ఫుల్‌గా మద్యం సేవించాడు. మద్యం మత్తులో మంచిర్యాల జిల్లా అంబేద్కర్‌ చౌరస్తా వద్ద అర్థరాత్రి రోడ్డుపై ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సమాచారం అందుకున్న బ్లూకోట్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని ఎస్సైని తన స్నేహితులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే ఎస్సై వారి మాట లెక్కచేయకుండా బ్లూకోట్ సిబ్బందిపైనే దాడిచేశాడు. వారివద్ద ఉన్న ట్యాబ్‌లను ధ్వంసం చేశారు ఎస్సై స్నేహితులు. దీంతో స్థానికులు అడ్డుకోవడంతో.. కారు వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎస్సై దాడిలో నలుగురు బ్లూకోట్‌ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కారును పోలీస్‌ స్టేషన్‌ కు తరలించి, అతనిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Priyadarshi: నల్లగా, హీరో కంటే పొడుగ్గావున్నావని రిజక్ట్ చేశారు