Site icon NTV Telugu

Akbaruddin Owaisi: సిద్ధంగా ఉండండి.. కాంగ్రెస్‌ నేతలకు అక్బరుద్దీన్‌ హెచ్చరిక

Akbaruddin Revanth

Akbaruddin Revanth

Akbaruddin: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య మాటల పటాకులు పేలుతున్నాయి. ఈ క్రమంలో వేలం పాటకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ నేతలకు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ హెచ్చరించారు. ఇక నుంచి పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. నేను ప్రసంగిస్తే దేశమంతా వణికిపోయిందని అన్నారు. సాయంత్రం నుంచి మిమ్మల్ని వేలం పాడుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మీరు వేలం పాటకు సిద్ధంగా ఉండండాలని కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ మాట్లాడుతూ.. అసదుద్దీన్ ఓవైసీ తన షేర్వానీ లోపల పైజామా ఉందనుకున్నానని కానీ.. లోపల ఖాకీ నిక్కర్ ఉందని అర్థమైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయన్ని బారిష్టర్ చదివించారు. కానీ.. అసదుద్దీన్ ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్దతుగా ఉంటున్నారన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాజాసింగ్‌పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదు? అంటూ రేవంత్ ప్రశ్నించారు.

కాగా.. కేసీఆర్, మోడీ లాంటి దొంగలను కాపాడడానికి ఓవైసీ అబద్ధాలు చెప్తున్నారని రేవంత్ ఆరోపించారు. కాగా.. ఈ క్రమంలోనే.. అసద్దుద్దీన్‌కు రేవంత్ సవాల్ విసిరారు.. కర్ణాటక ఎన్నికల సమయంలో మోడీ, అమిత్ షాకు సన్నిహితుడైన ఓ కీలక వ్యక్తికి తన ఇంట్లో ఓవైసీ పార్టీ ఇచ్చారని సంచలన ఆరోపించారు. ఆ కీలక వ్యక్తికి పార్టీ ఇవ్వలేదని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్దమా? అని రేవంత్ ఛాలెంజ్ చేశారు. అంతేకాకుండా.. తాను హిందువునని భాగ్యలక్ష్మి గుడికి వెళ్తా.. దర్గాకి రమ్మన్నా వస్తానంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మక్కా మసీదులో ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. నేను శుక్రవారం రోజు మక్కా మసీదుకు వస్తానని.. ఖురాన్ పట్టుకొని ప్రమాణం చేయడానికి ఓవైసీ సిద్ధమా అంటూ రేవంత్ ఛాలెంజ్ విసిరారు.
Vivo X100 Pro Launch: లాంచ్‌కు ముందే వివో ఎక్స్‌100 ప్రో ఇమేజ్‌లు.. భారీ కెమెరా ఐలండ్‌!

Exit mobile version