NTV Telugu Site icon

Minister KTR: తెలంగాణకు కేటీఆర్ గుడ్ న్యూస్.. మరో భారీ పెట్టుబడి

Airtel Nxtra Hyper Scale

Airtel Nxtra Hyper Scale

Airtel Nxtra To Build Hyper Scale Data Centre In Hyderabad: తెలంగాణకు మంత్రి కేటీఆర్ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. దావోస్ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి తీసుకొచ్చారు. రూ. 2 వేల కోట్లతో భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ రాష్ట్రంలో హైపర్ స్కేల్ డేటాసెంటర్‌ను (60 మెగావాట్ల సామర్థ్యంతో) ఏర్పాటు చేయనుంది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్ స్కేల్ డేటా సెంటర్.. హైదరాబాద్‌లో ఏర్పాటు అవ్వనుంది. తన అనుబంధ సంస్థ నెక్స్‌ట్రా ద్వారా భారతీ ఎయిర్‌టెల్ ఈ డేటాసెంటర్‌ను నెలకొల్పుతుంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలీయన్‌లో.. మంత్రి కేటీఆర్‌తో భారతీ ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్, వైస్ ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ రాజన్ భారతీ మిట్టల్‌లలో సమావేశం అయిన తర్వాత ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది.

Dialysis: కిడ్నీ రోగుల్లో డయాలసిస్ భయాలు.. అసలు వాస్తవాలు ఇవే..

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “ఎయిర్‌టెల్‌-నెక్స్‌ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉంది. దేశంలో హైపర్‌ స్కేల్ డేటా సెంటర్‌లకు హైదరాబాద్ ఒక హబ్ మారింది. ఎయిర్‌టెల్ తాజా పెట్టుబడితో మేము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నా. ఎయిర్‌టెల్, తెలంగాణ మధ్య ఈ సంబంధం ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నా. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎయిర్‌టెల్-నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది’’ అని అన్నారు. ఇక భారతీ మిట్టల్ మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ డేటా సెంటర్ ప్రాజెక్టులలో ఒకటి. తెలంగాణతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఇతర రంగాల్లోనూ మా ఉనికి, ముద్రను చాటుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం’’ అని పేర్కొన్నారు.

C Kalyan: ఆ ఇద్దరిని బహిష్కరిస్తున్నాం.. నిర్మాత కళ్యాణ్ బాంబ్