NTV Telugu Site icon

చరిత్రలో మొదటిసారిగా 20 వేల గంటలకు పైగా ఫ్లయింగ్ టైమింగ్

చరిత్రలో మొదటిసారిగా 20500 గంటల ఫ్లయింగ్ ట్రైనింగ్ టైమింగ్ ఈ బ్యాచ్ క్యాడెట్లు చేశారు అని… దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇన్స్ట్రక్టర్ లకు, ఇతర సిబ్బందికి అభినందనలు తెలిపారు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కే‌ఎస్ బదౌరియా. కోవిడ్ సమయంలో 3800 గంటలు ప్రయాణించారు ఐఎఎఫ్ టీమ్. సమయానికి ఆక్సిజన్ చేరవేయడంలో ఐఎఎఫ్ కీలక పాత్ర పోషించింది. 161 మంది క్యాడేట్ లకు అభినందనలు తెలిపారు.

Read Also : భారత్ కరోనా : 2 వేలకు దిగువగా మరణాలు

ఇక ఈ రోజు నుండి దేశం కోసం త్యాగం చేయడమే మీ ద్వేయం అన్నారు. క్యాడేట్ ల తల్లిదండ్రులు గర్వపడాలి. గత కొన్ని సంవత్సరాలుగా దేశ భద్రత లో వాయు సేన సేవలు కీలకంగా వ్యవహరిస్తుంది. రానున్న రోజులు మీ దైర్య సాహసాలకు పరీక్ష అని అన్నారు. 87 మంది బీటెక్ చదివిన వారు ఫ్లైయింగ్ ఆఫీసర్లు ఉండటం మంచి పరిణామం. గత రెండు నెలల గా కొవిడ్ సమయం లో రాష్ట్రాలకు వాయు సేన సేవలు అందిస్తుంది. ఆక్సిజన్ సప్లై , మెడికల్ పరికరాలు రవాణా చేయడంలో వాయు సేన నిరంతరం కీలకపాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు.