Site icon NTV Telugu

AIMIM Jaffar Hussain: 25 సంవత్సరాల నుండి లేని ఉలుకు ఇప్పుడెందుకు మొదలైంది

Mla Jafhar Husaain

Mla Jafhar Husaain

AIMIM MLA from Nampally, Jaffar Hussain Meraj: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో ఇటీవలే పేద ముస్లింల ఇండ్లను కూల్చిన సంఘటన లో రేకుర్తి జరీనా నగర్, మొహసీన్ నగర్ లో క్షేత్ర స్థాయిలో పర్యటించి కూల్చిన ఇండ్లను పరిశీలించారు. పేద ముస్లింలతో మాట్లాడి పూర్తిస్థాయిలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ పర్యటనలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మాట్లాడుతూ.. పేద ముస్లింల ఇండ్లు కూల్చిన దుండగులు టెర్రరిస్టులతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Supreme Court: మణిపూర్ ఇంటర్నెట్ నిలుపుదల కేసు అత్యవసర విచారణకు సుప్రీం తిరస్కరణ

ఇండ్లు కూల్చిన దుండగులపై టెర్రరిస్ట్ యాక్ట్ కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు. కూల్చిన ఇండ్ల స్థలంలోనే ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్‌ చేశారు. పేద ముస్లింలకు న్యాయం జరిగేంత వరకు ఎంఐఎం అండగా ఉంటుందని తెలిపారు. 25 సంవత్సరాల నుండి లేని ఉలుకు ఇప్పుడెందుకు మొదలైందని అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ రౌడీలకు, భూకబ్జా కోరులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు. పేదల ఇండ్లను పడగొడుతా ఉంటే పోలీసులు ఘటన స్థలంలో ఉండి ప్రేక్షక పాత్ర వహించడం దేనికి సంకేతం అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సూటి ప్రశ్నించారు.
Uttarkashi: ఉత్తరకాశీలో ఉద్రిక్తత.. నగరాన్ని విడిచి వెళ్లిపోతున్న ముస్లింలు

Exit mobile version