Komatireddy Venkatareddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీస్ పంపింది. గత నెల 22న కోమటిరెడ్డికి షోకాజ్ నోటీస్ పంపిన క్రమశిక్షణా కమిటీ పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీస్‌కు కోమటిరెడ్డి స్పందించకపోవడంతో.. ఏఐసీసీ మళ్లీ షోకాజ్ నోటీష్ జారీ చేసింది.
పార్టీని చూడకుండా తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓటు వేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పిన ఆడియో ఒకటి వైరల్‌గా మారి చర్చకు దారితీస్తుండగా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆయన మరోసారి సంచనల వ్యాఖ్యలు చేశారు. 21న కోమటిరెడ్డి ఆడియో లీక్ అయ్యి వైరల్‌గా మారితే.. అక్టోబర్ 22న వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. దీనిపై స్పందించిన ఏఐసీసీ సీరియస్ అయ్యింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కి సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తకు ఫోన్ చేసిన ఆడియో వైరల్ కావడం పై ఎఐసీసీ సిరీయస్ అయ్యింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో 10 రోజుల్లో సమాధానం చెప్పాలని AICC నోటీస్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అభిమానులతో ఆయన మాట్లాడుతున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.
Read also: Tarun Chugh: వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధం లేదు.. కేసీఆర్ చెప్తున్నది అబద్ధం
మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అని తేల్చేశారు కోమటిరెడ్డి.. నేను వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినా పదివేల ఓట్లు వస్తాయి.. తప్ప గెలవబోమన్నారు.. దానికి కారణం కూడా చెప్పారు కోమటిరెడ్డి.. రెండు అధికార పార్టీలు (టీఆర్ఎస్-బీజేపీ) కొట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? అని ప్రశ్నించారు. డబ్బులు కాంగ్రెస్ పెట్టలేదు అన్నారు.. నేను 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేశా.. ఎంపీగా కొనసాగుతున్నాను.. చాలు ఇక విశ్రాంతి తీసుకుంటానన్నారు.. రాష్ట్రంలో పాదయాత్ర చేద్దామనుకున్నా.. కానీ, కాంగ్రెస్‌లో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూపు అని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను వెళ్లి ప్రచారం చేసినా ఓడిపోయేదే… ఓడిపోయే సీటుకు ప్రచారం చేసేది ఎందుకు..? అని ఎదురు ప్రశ్నించారు.. అంతేకాదు, నేను మునుగోడుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పలేనని కుండబద్దలు కొట్టేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఏఐసీసీ ఆడియో వీడియోలతో సీరియస్ తీసుకుంది. ఆయనపై సోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరి రెండో సారి షోకాజ్ నోటీసు పై కోమటిరెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Twitter: చిక్కుల్లో ఎలాన్ మస్క్.. కోర్టులో పిటిషన్.. కారణం ఇదే..