NTV Telugu Site icon

Student Suicide: నా పిల్ల నన్ను మోసం చేసింది.. ‘అమ్మా సారీ’ అంటూ సెల్ఫీ వీడియో..!

Selfi Susaid

Selfi Susaid

Student Suicide: ప్రేమలో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు సాధారణం. అవి వచ్చినప్పుడు ఎవరో ఒకరు రాజీ పడితే సమస్య పరిష్కారమవుతుంది. కానీ ఈగోలకు పోతే అది బంధం తెగిపోయేంత వరకు దారి తీస్తుంది. ప్రేమలో పడితే చాలు తల్లిదండ్రులు కనిపించరు. ప్రేమ మోహంలో మునిగి తేలిపోతారు. ప్రేయసి పక్కనుంటే ప్రపంచాన్నే జయించినట్లు ఫీలవుతారు. అదే కాస్త గొడవైతే జీవితమే వేస్టన్నంత విరక్తి చెందుతారు. ఆ సయమంలో ఇన్నేళ్లు కడుపున పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులు కనిపించరు. వారికి కడుపుకోత మిగల్చి అమ్మాయి మోసం చేసిందని దారుణాలకు పాల్పడుతుంటారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చుతున్నారు. కొడుకు మంచి ఉద్యోగం చేసి కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న పేరెంట్స్ కు బతికుండగానే నరకం చూపిస్తారు. అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో చోటుచేసుకుంది. అమ్మాయి మోసం చేసిందని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుగా విలపిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. ప్రియురాలి మోసాన్ని తట్టుకోలేక సెల్ఫీ వీడియోలో తల్లిదండ్రులకు చివరి సందేశం పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నడుస్తున్న రైలు కింద తల పెట్టి ప్రాణాలు తీసుకున్నాడు.

Read also: Harish Shankar: మొన్న నితిన్ గడ్కరీ.. ఇప్పుడు తరుణ్ ఛుగ్.. బీజేపీ లీడర్స్ తో హరీష్ ముచ్చట్లేంటి?

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన కుర్వ మహేష్ (21) హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్ చదువుతున్నాడు. మహేష్ అదే కాలేజీకి చెందిన విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే గత కొద్దిరోజులుగా ప్రేమికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆ యువతి మహేష్ ను దూరం పెట్టింది. ప్రియురాలు దూరం కావడాన్ని మహేష్ జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. బుధవారం సాయంత్రం శంకర్‌పల్లి పట్టణానికి వచ్చాడు. రైల్వేస్టేషన్‌కు కొంతదూరం వెళ్లిన తర్వాత పట్టాలపై నిలబడి సెల్ఫీ వీడియో తీసి తల్లిదండ్రులకు పంపాడు. ‘అమ్మా.. నాన్న.. సారీ. నాకు బతకాలని అస్సలు ఇష్టం లేదు. ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. నన్ను దారుణంగా మోసం చేసింది. నేను ఇక ఉండలేను. అమ్మా నాన్నను బాగా చూసుకో నేను వెళ్తాను. అని వీడియో సందేశాన్ని కుటుంబ సభ్యులకు పంపించి ఆ తర్వాత రైలు పట్టాలపై పడి ప్రాణాలు తీసుకున్నాడు. అది చూసిన కుటుంబ సభ్యులు పరుగుల ఘటన వద్దకు వచ్చారు. కానీ కొడుకు రెండు ముక్కలైన దారుణాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. విషయం రైల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mahesh : భోళా శంకర్ టీజర్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించిన మహేష్..