Site icon NTV Telugu

AFRC Warning: అదనపు ఫీజు వసూలు చేస్తే.. కొరడానే!

Afrc Warning

Afrc Warning

Admission And Fee Regulation Committee Strong Warning To Colleges: కాలేజీలకు అడ్మిషన్ & ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్‌సీ) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే.. జరిమానా తప్పదని హెచ్చరించింది. జీవో నం.37 సూచించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేయరాదని.. ఏ ఇతర రూపంలోనూ డబ్బులు వసూలు చేయకూడదని తేల్చి చెప్పింది. ఒకవేళ అదనంగా ఫీజు వసూలు చేస్తే .. రూ. 2 లక్షల ఫైన్ వేస్తామని పేర్కొంది. అది కూడా ఒక్కసారి కాదు.. ఎంతమంది దగ్గర ఎక్కువ వసూలు చేస్తారో, అన్ని రూ. 2 లక్షలు కట్టించుకుంటామని ఆ కమిటీ తెలిపింది. అంతేకాదు.. అదనంగా తీసుకున్న ఫీజును విద్యార్థులకు తిరిగి ఇవ్వాల్సిందేనని సూచించింది.

బీ-కేటగిరీ అడ్మిషన్ల కోసం ఏఎఫ్‌ఆర్‌సి ద్వారా కాలేజీలకు తమ పేర్లను విద్యార్థులు పంపినా.. దరఖాస్తులు కాలేజీలకు అందడం లేదన్న ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో కమిటీ సీరియస్ అయ్యింది. వారి కేసులు మెరిట్‌పై పరిగణించబడతాయా? లేదా? అనేది కమిటీ పరిశీలిస్తోంది. ఆ దరఖాస్తులను ఆయా కాలేజీలు మెరిట్‌పై పరిగణించకపోతే.. చర్యలు తీసుకోవడానికి కమిటీ సన్నద్ధమవుతోంది. ఎంపిక చేసిన జాబితా నుండి సమాన సంఖ్యలో విద్యార్థులను తొలగించడం ద్వారా.. వారిని మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేస్తున్నారు. ఏఎఫ్ఆర్‌సీ ద్వారా దరఖాస్తులు ఫార్వార్డ్ చేయబడిన విద్యార్థుల మెరిట్ కంటే.. తక్కువ మెరిట్ ఉన్న వారికి సీటు ఇస్తే రూ. 10 లక్షల జరిమానా విధించబడుతుంది. పైన పేర్కొన్న రెండు జరిమానాలు.. సంబంధిత కన్వీనర్ వద్ద ఉన్న నిధుల నుండి వసూలు చేయబడతాయి.

Exit mobile version