Site icon NTV Telugu

Tudum Debba: నేడు రాష్ట్ర వ్యాప్త బంద్.. తుడుం దెబ్బ పిలుపు..

Adilabad

Adilabad

Tudum Debba: ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపు నిచ్చింది. జిల్లా కేంద్రంలో ని బస్టాండ్ ముందు ఆదివాసి ల ధర్నా చేపట్టారు. బస్సులు బయటకి వెళ్లకుండా గేటు ముందు తుడుం దెబ్బ నాయకులు బైఠాయించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఆదివాసి మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జైనూర్ లో ఆదివాసి మహిళ పై హత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గిరిజనులను రక్షించడానికి ఏజెన్సీలో PESA (భారతదేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం సాంప్రదాయ గ్రామసభల ద్వారా స్వయం పాలనను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం రూపొందించిన చట్టం) వంటి చట్టాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌ను సహకరించాలని కోరుతూ తుడుందెబ్బ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ తుడుందెబ్బ గ్రామస్టులు బంద్ కు పిలుపునివ్వడంతో అలర్ట్ అయిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నేడు సెలవు ప్రకటించారు. అంతే కాకుండా నేడు మంత్రి సీతక్క ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ముందస్తు అరెస్ట్ లు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు చేరుకున్నారు.
Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అడుగు పెట్టబోతున్నాడు..

Exit mobile version