NTV Telugu Site icon

Adilabad CCI: ఆదిలాబాద్ సీసీఐ కథ ముగిసిందా?

Cciadb

Cciadb

వేలాదిమందికి ఉపాధి కలిగించింది. లక్షలాదిమందికి అన్నం పెట్టింది. ఎంతో చరిత్ర కలిగిన ఆదిలాబాద్ సీసీఐ కథ చివరి దశకు చేరింది. సిమెంట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ మినహా అన్నీ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు భగ్గుమంటున్నాయి. CCI సాధన కమిటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా కేంద్రానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు సిద్ధమౌతున్నారు.

సిమెంట్ పరిశ్రమను పున:ప్రారంభించాలంటూ గత కొంతకాలంగా CCI సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. మరోవైపు అవేమి పట్టించుకోకుండా సిమెంట్ ఫ్యాక్టరీని పూర్తిగా మూసివేసే దిశగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అడుగులు వేయడం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల CCIలో ఉన్న యంత్రాలను తొలగించి వాటిని స్క్రాప్‌లో విక్రయించేందుకు గానూ ఈ టెండర్ పిలిచింది. దీంతో ఇన్నాళ్లు ఈ పరిశ్రమ పునరుద్ధరణపై ఆశలు పెట్టుకున్న స్థానికులకు నిరాశే ఎదురైంది. కేంద్రం సిమెంట్ ఫ్యాక్టరీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపట్ల CCI ఉద్యోగులు, భూ నిర్వాసితులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. భూ నిర్వాసితులు ఆదిలాబాద్‌-నాగ్‌పూర్‌ రహదారిపై ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్‌లో సిమెంటు పరిశ్రమ ఏర్పడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని గతంలో తాము తక్కువ ధరకు భూములను విక్రయించామని, కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా పరిశ్రమను మూసివేయడంతో తాము నష్టపోయినట్టు సీసీఐ భూ నిర్వాసితులు అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీసీఐని అమ్మడానికి నిర్ణయం తీసుకున్నందున యంత్ర సామగ్రి వేలం వేస్తోందని, దీనిని వెంటనే ఆపాలంటున్నారు. గతంలో తాము ఇచ్చిన భూముల ధరలు ఇప్పుడు ఎకరానికి రూ. కోటి పలుకుతున్నాయన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూములను ఇచ్చి నష్టపోయిన తమకు తిరిగి భూములను అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

CM KCR: సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో ముగిసిన భేటీ