Site icon NTV Telugu

Adilabad Adivasis : ఇంద్రవెల్లి సభలో ఆదివాసీల సంచలన నిర్ణయం

Adivasi

Adivasi

Adilabad Adivasis : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి సభలో ఆదివాసి సంఘాలు తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టంచేసిన ఆదివాసి నేతలు, ప్రభుత్వాలు తమకు అండగా నిలవని పక్షంలో అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా వారు, ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని వనరుల తరలింపును అడ్డుకుంటామని ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు లంబాడీలకు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేయరాదని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సిమెంట్ పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం నీటి వినియోగం, ఏజెన్సీ ప్రాంతాల్లోని వనరుల తరలింపును నిరోధిస్తామని చెప్పారు.

OIC Kashmir Meeting: అగ్రరాజ్యంలో భారత్‌కు వ్యతిరేకంగా ముస్లిం దేశాల సమావేశం..

ఆదివాసులను కించపరుస్తూ లంబాడీలు వ్యవహరిస్తే, ఏజెన్సీ ప్రాంతాల్లో వారు ఎలా ఉద్యోగాలు చేస్తారో చూపిస్తామని కూడా హెచ్చరించారు. ఈ ఘాటైన వ్యాఖ్యలు సభలో గట్టి ప్రతిధ్వనిని రేపాయి. ప్రజల జీవనోపాధి, సాంప్రదాయ జీవన విధానాలను రక్షించుకోవడం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే మరింత తీవ్రమైన ఆందోళనలు చేపడతామని నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వాలు స్పందించకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు తలెత్తే అవకాశముందని సభలో వ్యక్తమైన భావోద్వేగాలు సూచిస్తున్నాయి.

Botsa Satyanarayana: విద్య, వైద్యం ప్రైవేటీకరణ చేస్తే చరిత్ర హీనుడిగా నిలిచిపోతారు.. సీఎంపై బొత్స ఫైర్..

Exit mobile version