Site icon NTV Telugu

Addanki Dayakar: మరోసారి “సారీ”.. భవిష్యత్తులో అలా జరగనివ్వను

Addanki Dayakar

Addanki Dayakar

చండూర్ లో జరిగిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్‌ లో భగ్గుమంటున్నాయి. దీంతో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అద్దంకి దయాకర్‌ ను సస్పెండ్‌ చేయాల్సిందే నని డిమాండ్‌ పై ఆగస్టు 6వ తేదీని అద్దంకి దయాకర్ క్షమాపనలు చెప్పిన కోమటి రెడ్డి వెంకట్‌ స్పందించలేదు. క్షమాపణలు కాదు సస్పెండ్‌ చేయాల్సిందే అంటూ డిమాండ్‌ కు దిగడంతో.. ఇవాళ మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి క్షమాపణ చెప్తున్నా, భవిష్యత్తులో అలా జరగనివ్వనని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ తెలిపారు. పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతో.. మరోసారి క్షమాపణలు చెప్పారు ఆయన. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులపై రాతపూర్వకంగా క్షమాపణ బహిరంగంగా కూడా క్షమాపణ కోరానని తెలిపారు. పార్టీతో కలిసి పని చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకు రావాలని ఆయన కోరారు. భవిష్యత్తులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పార్టీ చూసుకుంటుందని ఆయతెలిపారు. క్షమాపణలు చెబుతూ ఓవీడియో ద్వారా ఆయన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.

read also: BJP CM candidate : ఫ్లవర్ పార్టీలో ఫైరింగ్ ఎక్కువైందా..? నేతల్లో ఫైర్ దారితప్పుతోందా..?

ఆగస్టు 6వ తేదీన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. చండూర్ సభలో తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి పదాలు వాడలేదని. పార్టీకి నష్టం కలగకూడదనే క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. వాడుక భాషలో ఆ పదాలు వచ్చాయని.. దీనిపై కొంత అభ్యంతరం వచ్చిందని దయాకర్ అన్నారు. తప్పు జరిగిందని.. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేయడంపై టీపీసీసీ షోకాజ్ నోటీసులు వచ్చాయని.. నోటీసులు రావడాన్ని తప్పుగా భావించడం లేదని.. మళ్లీ ఇది రిపీట్ కాదని మాటిస్లున్నానని అద్దంకి దయాకర్ అన్నారు. వెంకట్ రెడ్దిగారి మనోభావాలు దెబ్బతింటే.. వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

చండూర్ లో జరిగిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంటక్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు ఎటు పక్కన ఉంటారని.. ఈ గట్టున ఉంటావా..? ఆ గట్టున ఉంటావా..? అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గంలో ఎన్నికలు వస్తుంటే.. మీరు మోదీ, అమిత్ షాల వద్ద మోకరిల్లారని విమర్శించారు. మీరు కాంగ్రెస్ లో ఉంటే ఉండండీ.. లేకపోతే.. అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మరి మరోసారి క్షమాణలపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఎలా స్పందిస్తారో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంలో మారింది.
BJP: ఈటెల సమక్షంలో బీజేపీలో చేరిన సినీ నటుడు

Exit mobile version